శీర్షిక: ఎలుగుదీపంగావాలే
గరీబోల్ల పిల్లలంతా బలిపసువులౌతుండ్రు
ఉన్నోడేంచెబితే తలూపే గొర్రెలౌతూ గోతిలబడుతుండ్రు
తనవునంతా తునాతునకల్జేసుకుంటూ
కన్నవాళ్ళకు కడుపుకోతలౌతుండ్రు
సదువుకున్న సదువునిడిసి అర్థంపర్థంలేని దారిలో వెంపర్లాడవట్రి
రాజకీయ రంగుల్లో వెలిసినపోయిన బతుకెల్లదీయవట్రి
ఉడుకురక్తమంత ఉత్తుత్తి మాటలకు ధారవోయవట్టిరి
ఉద్యమమేందైనగని
వెనకబడినోళ్ళబిడ్డలే
తగలవడవట్టిరి
అధికారమున్నోళ్ళ పిల్లలేమో
సల్లటి గదుల్లో రేపటి రాజులై భవిష్యత్తు దిద్దుకోవట్టిరి
మాయమాటలనమ్మి
అల్లరిమూకలౌతుండ్రు
ఆలోచన మరిసి మత్తుల మురవబట్టిరి
బతుకుకు సీకటి పులుముకుంటుండ్రు
రాజకీయగొడవల్లో ఎదవలవలే ఎగవడుతుండ్రు
సంఘటేదైనా సైరన్లైతున్నరు
తరాలొక్కొక్కటి నేలరాలుతున్నా
తలరాతలక్కడే
చెప్పుడుమాటలకు తలూపుడుగాళ్ళవుతుండ్రు
చైతన్యం చచ్చిన బానిసలౌతుండ్రు
బతుకును దిద్దుకునుడు మరిసి
అప్పులమోతకు వారసులౌతుండ్రు
పకడ్బందీ పనిమరిసి
పనికిమాలిన బతుకులతో కులుకవట్టిరి
తాగుడైతే వారసత్వమౌతున్నది
పాడుపనులకు ముందుకొచ్చి
చెరసాలలో సైతం మేమేనంటూ దుర్భరమైన
జీవితాన్నెల్లదీస్తుండ్రు
రాజకీయలకు జెండా మోసీ
వారిజీవితాలను తాకట్టువెడుతుండ్రు
ఎవరికలలకోసమో
కత్తులతో సవాసంజేస్తూ
రక్తానికి రుచిమరిగే రాక్షసులౌతున్నరు
చైతన్య
వెలుగుదీపమొక్కటైన
వెలగట్లేదక్కడ
అవకాశాలెన్నో ముందలున్నయ్
కళ్ళుతెర్సి కొత్తదారినపోవాలిపుడు
సి.శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన దేనికి అనుకరణ కాదు.