శీర్షిక:రక్షణకవచం పేరు: సో. శేఖర్(సియస్సార్)

శీర్షిక:రక్షణకవచం పేరు: సో. శేఖర్(సియస్సార్)

శీర్షిక: రక్షణకవచం

రాజ్యంగమంటే
నేడు 
ఎవరికివాళ్ళు రాసుకుని
ఇష్టమున్నట్లు పాలించడమేనేమో
ఉన్నతమైన విలువలతో
ఎంతో శ్రమించి
ప్రజలకవసరమైనవక్కడుంచి
రచించిన సర్వజనుల ఆమోదముద్రది
పాలనమాత్రం మారడంలేదు
మనువాదులచేతుల్లో
మార్పుకు లోనవుతుందది

సామాన్యుడు సైతం 
అసామాన్యుడై విలువపొందేలా 
అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా
మనిషైనవాడికి విలువపెంచేలా
అవకాశాలకు వారధి రాజ్యాంగం

హక్కులు విధులు
ఆదేశసూత్రాలు 
అనుసరించి 
దేశాన్ని ముందుంచేందుకే
నియమాలు నిబంధనలు
ప్రతిదానికో ఆర్టికల్స్
ఎవరేంచేయాలో
అక్షరబద్దంగా అద్దంలా చూయించి సరిచేసే ప్రతిబింబం రాజ్యాంగం

ఓటుహక్కును పౌరులందరికీ
ప్రసాదించి సమానత్వాన్నందించిన మానవతగ్రంథం రాజ్యాంగం

నేడది
కుటిలవర్తనుల కనుసన్నల్లో బందియే
వెనకబడిన కులాల చైతన్యమే రాజ్యాంగ ఫలాల మోక్షానికి మార్గం
లేకుంటే దోపిడిదారులకు రాచమార్గం

మనువాదుల చాదస్తంతో
లేనోడెపుడు 
బాంఛన్ బతుకులతో వెలివాడల్లో కాలమెల్లదీయాలనే

అంబేద్కర్ ఆశయాన్ని అంతమొందించడమే
కార్పొరేట్ కాలర్స్ చేతుల్లో
దేశాన్నుంచి 
దేశసంపదనంతా ధారదత్తం చేయడమే
సంపన్నులకు సహాయకరంగా
సర్వం దోచేయడమే
సన్యాసుల చేతుల్లో పాలనాపగ్గాలు లేదంటే
కుటుంబ పాలనలే

కులరహిత సమాజ సాకారం
సమసమాజస్థాపనే
సమాజం నిర్మాణమవ్వాలనే
ఆనాటి మహనీయుల కల
అదో తీరనికలైంది
తీరంచేరని బతుకులు
ఇంకా వెలుగులేని జీవనం

సార్వభౌమాధికామంతా
నోట్లకట్టలిసిరేసి ఓట్లకెసరడుతున్న వారిదేనాయే
ఏదేమైనా రాజ్యాంగమే
అందరికీ
రక్షణ కవచం కానీ
దానికే రక్షణలేని రోజులివి

సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు
9010480557.

హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments