కె.సి.ఆర్ కు అక్షర శుభాకాంక్షలు

కె.సి.ఆర్ కు అక్షర శుభాకాంక్షలు

కారణజన్ముడవు
 నీ ఆహార్యం అతి సాధారణ0
 శరీరం బక్కపలుచనిది
ఆలోచనలు ఏనుగంతవి
విమర్శకులు ఎక్కుపెట్టి
సంధించిన బాణాలు వెనక్కి
పోవాలిసిందే
తొలిదశలో ఊరు ఊరు తిరిగి
డగపడ్డ తెలంగాణను 
మన బాషా లో యాసలో
చెప్పి రణం చేసిన ధీరుడవు
     నీ మాటల తూటాలే
    ఈటలై  ప్రతి గుండెను కదిలించి
సకల జనుల సమ్మె
సబ్బండ వర్గాల నినాదం
స్ఫూర్తి నింపినావు
ప్రాణాలకు తెగించి
నిరాహారదీక్ష తో
సాధించావు
కుతంత్రాలు ఎన్ని చేసిన
భారతంలో ని అభిమన్యుడిగా
కాకుండా కలియుగ అభిమాన్యుడవు నీవు అయ్యావు
సాధించి తెచ్చావు
రైతు బంధు రైతు ధీమా
తో ధీమా గా నిలిపవు
రైతుల బతుకులను
కల్యాణ లక్షిమి,షాది ముభారక్
తో పేదింటి ఆడపడుచుల
అన్నావు అయ్యావు
కాళేశ్వరంతో సాగు నీరు కష్టాలు
మిషన్ భగీరథ తో తగునీళ్ల కష్టాన్ని
ఆసరా పెన్షన్ ల తో
ఇంటింటా పెద్ద కొడుకువు అయ్యావు
కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు
పెంచి చేయూత అయ్యావు
నీ శక్తి ఒక యుక్తి
నీ మాట ఆయుధం
తెలంగాణ సాధకుడవు
ప్రతి పక్షాలు ఎన్నిచెప్పిన
విమర్శలు చేసిన తెలంగాణ
సాధన నీదే
60 సంత్సరాల కళను సుసాధ్యం చేసినావు
ఒకే ఒక కోరిక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కు
ఒక్క సారి ప్రేమతో చూడు
దృష్టి సారించు 
మా ఆశలను బతికించు
    మీరు వంద సంత్సరాలు
జీవించాలి
నీ యోగం యాగాలు
కల్పిస్తాయి  చీరంజీవిని
ఒక సామాన్యుడు అక్షర
శుభాకాంక్ష🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
    ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments