జన సంద్రం - మేడారం

జన సంద్రం - మేడారం

మేడారానికి తెలంగాణ రుణపడి ఉంటది
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట స్ఫూర్తిని రగిలించి దుర్మార్గపు రాచరికాన్ని ఎదిరించి పోరాడిన వీరులను స్మరిస్తూ బయటి ప్రపంచానికి పరిచయం చేసిన గిరిజన బిడ్డలకు తెలంగాణ రుణపడి ఉంటది.
                                                --- రాజేంద్ర

జన సంద్రం - మేడారం

ప్రాంతం నుండి
పక్క రాష్ట్రాల నుండి  
అశేష ప్రజానీకం మమేకమై 
జన సంద్రాని తలపించే 
వనజాతర మన జన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. 

రాజరికాన్ని నిరసించి 
ప్రజాపోరాటన్ని సాగించిన 
వీరవనితల కొలువ ప్రతినిత్యం 
లక్షలాదిగా తరలివచ్చే 
నాలుగు రోజుల జాతర 

వందల ఏళ్ళుగా 
వీరుల త్యాగాలకు మారుగా నిలిచి 
చరిత్రకు సాక్ష్యంగా సాగుతున్నది.  

ఒక ప్రాంతపు పరిధిని దాటి 
రాష్ట్రపు ఎల్లల్ని దాటి 
తెలంగాణ వీరుల పోరాటాల చరిత్రకు 
సజీవ సాక్ష్యంగా నిలిచిన 
జన జాతర గిరిజన జాతర 
జన సంద్రాని తలపించే మహా జాతర 

తెలంగాణ గడ్డ
పోరాట వారసత్వాల మేటి అడ్డ

--- రాజేంద్ర

0/Post a Comment/Comments