సాహిత్య కవన కిరీటి..!దేవరాయలు...!! --- రచయిత : తణుకు గంగాధర

సాహిత్య కవన కిరీటి..!దేవరాయలు...!! --- రచయిత : తణుకు గంగాధర




సాహిత్య కవన కిరీటి..!
దేవరాయలు...!!
  --- రచయిత : తణుకు గంగాధర
ఎస్ వి యూనివర్సిటి, తిరుపతి. తెలుగు శాఖ, ద్వితీయ సంవత్సరం
 

సాహిత్య కవన కిరీటీ.!దేవరాయలు..!!
తల్లి నాగలాంబ,
తండ్రి నరసా నాయకుడు,
ముద్దుల కోమరుడు.
తుళువ వంశాన్ని వ్రాసి కెక్కించిన
దేవరాయలు.
స్వర్ణ పాలన జేసి, తిమ్మరసు ను అమాత్యులగా జేసికొని
ఒక సుకవిగా, ప్రబంధ కవిగా
తెలుగు సాహితీని సేద్యం చేసిన సార్వభౌముడు..!దేవరాయలు..!!
శ్రీకాకుల ఆంధ్ర మహావిష్ణువును దర్శించి ప్రసన్నించుట కై
తెలుగు సాహిత్యానికి
"ఆముక్తమాల్యద" ని కానుకగా
అందించి..
తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచి పోయిన.!దేవరాయలు..!!
విజయనగర మహా సామ్రాజ్యాన్ని పాలించిన మహా చక్రవర్తి,
సాహిత్య సమరాంగణ సార్వభౌముడు,
ధర్మ నిరతి పాలించిన ధన్యజీవి, రాయలేలిన సీమ యే రత్నగర్భ
యన చిరయశము పొందిన అమరజీవి,
భువనవిజయమున  కవనము పోషించి గర్వించి నిలిచిన సార్వభౌముడు..!దేవరాయలు..!!
తుళువ వంశ రాయ, శ్రీ కృష్ణదేవరాయ,
భువనవిజయ సాహితీ మకుట రాయ,
తెలుగు కన్నడ భాషల పోషక రాయ,
నాగలాంబ ముద్దుల తనయుడు,
ఇరువది వర్షముల కే చక్రవర్తి ఇతడు,
విజయనగర సామ్రాజ్య కిరీటి ఇతడు,
స్పూటకపు మచ్చలున్నను తేజస్సు కలవాడు,
ఎత్తు భువికి ఐదు అడుగుల రేడు,
దక్షిణ భారత సామ్రాజ్య దిగ్గజం,
అష్టదిగ్గజముల "సాహిత్య కవన కిరీటి"
హంపి పురవీధుల సాహిత్య పసిడి
మెరిపించినాడు ఇతడు,
ఆంధ్ర భోజుడ సమరాంగణమున సింహబలుడు..!దేవరాయలు..!!


0/Post a Comment/Comments