తేది: 20.02.2022
పేరు: మార్గం కృష్ణమూర్తి
ఊరు: హైదరాబాద్
చరవాణి: 9441841314
హామి: ఇది నా స్వీయరచన , మీడియా కథనాల ఆధారంగా
శీర్షిక: "చిత్రా రామకృష్ణ - విచిత్ర లీలలు"
"చిత్ర" దేశంలో పెట్టింది ఒక రచ్చ
స్త్రీ జాతికే ఒక చెరగని మచ్చ
పుట్టింది తమిళనాడు బ్రాహ్మణకుటుంబంలో
అమ్మా నాన్నా యెంతో ఉన్నత కుటుంబం!
గొప్ప అందగత్తే , అతి లోక సుందరి
ప్రతిభావంతు రాలు ప్రజ్ఞాశాలి
అదే చేస్తున్నది ప్రపంచాన్ని అతలాకుతలం
ఇరువదొక్కేండ్లకే సి.ఎ. పూర్తి
చార్టెడ్ అకౌంటెంట్ గా జీవితం ప్రారంబం!
ఐ.డి.బి.ఐ లో మొదటి ఉద్యోగం
అత్యంత ప్రతిభ కనబరిచిన అమ్మడు
ఛైర్మన్ దృష్టిలో పడిపోయింది గుమ్మడి
ఎన్.ఎస్.సి. కమిటీకి రెకమండ్ చేసేనతడు!
అప్పటికే ఓ యోగితో పరిచయం
యోగి సలహాలతోనే వృత్తి ప్రయాణం
అంచెలంచెలుగా ఎదిగే శరవేగంతో
ఎన్.ఎస్.ఇ. కి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యే!
నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ దేశానికి వెన్నెముక
కోట్లాది మదుపరులకు రక్షణనిచ్చేది
దేశ విదేశాల పెట్టుబడుల నాకర్షించే సంస్థ
దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మ!
కొంత కాలానికే సి.ఇ.వో గామారే "చిత్ర"
యోగి డైరెక్సన్లో ఆడిందే ఆట పాడిందే పాట
యోగికి పంపే ఎన్.ఎస్.సి డ్యాటానంతా
శిరోణ్మని సూచనల మేరకే చిత్రారామకృష్ణ
ఆనంద్ సుభ్రమణ్యంకు ఉద్యోగం సృష్టించే!
అనామకుడికి కోటిన్నర జీతం యేడాదికి
అది పెరిగే మూడేళ్లలో నాల్గున్నర కోట్లు
యోగితో రహస్యాలను కాపాడటానికే
ఆనంద్ సుభ్రమణ్యాన్ని అపాయింట్ చేసే!
యోగి మనిషే కాదు "శక్తి" అనిబుకాయిస్తుండే
అతనొక "సిద్దపురుష్" అని చెప్పుకొస్తుండే
అతనొక "పరమహంస" అని వాదిస్తుండే
నేనెపుడూ యోగిని కలవలేదని పలుకుతుండే!
యోగి పంపిన మేయిల్స్ లో రాసలీలలు
ఎన్.ఎస్.కి వేల కోట్ల పలుకుబడి నష్టం
హర్షద్ మెహతా, కేతన్ కంటే పెద్ద స్కామ్
నేడు దేశంలో , ప్రపంచంలో భూప్రకంపనలు!
ఎవరా "స్ప్రిచ్యువల్ యోగి" ?
కోట్లకుపడగలెత్తినచిత్రకు సంబంధమేమి?
ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది?
ఆరేళ్ళయినా అంతు తేల్చలేమా?
"సెభి" పై మదుపరులకు నమ్మకంపోయే
రేపు దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం కానుండే
చిన్న మదుపరులు నష్టాల పాలుకానుండే
మూడుకోట్ల పెనాల్టీ తో సెభి చేతులుదులుపుకునే!
పెరుగుట విరుగుట కొరకే నన్నట్లు
యెంత శరవేగంతో ఎదిగిందో
అంతే వేగముతో "చిత్రా రామకృష్ణ"
అధః పాతాళానికి పడిపోయే!