శీర్షిక: పయనమెటో? పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: పయనమెటో? పేరు: సి. శేఖర్(సియస్సార్)



శీర్షిక: పయనమెటో?!

దేశమా! 
ఎటేపు నీ పయనం
సిద్దించిన స్వాతంత్య్రం
సిగ్గపడుతోంది
సామాన్యుడి స్థితిగతులను
సాగుతున్న పాలననుచూడలేక
తలరాతలు మారని బహుజనులజూసి
మార్పన్నది రాక
మరణమే తనకు శరణమనే
తీరుతెన్నులు జూసి
తలదించుకునే నిలబడి
నిర్వేదంతో వేధనే పరమావధిగా సమాదివైపడుగులేస్తోంది
ఎన్నో వనరులకు వసతులకు
చిరునామా ఈ దేశం
తన ఒడిలో ఓలలాడే జాతిజనులందరికవందాలనే
కోరిక తీరనిదై 
తనలోతానే రోదిస్తోంది
రాజ్యాధికారమెవడు చేపట్టిన
తన తనువులోని అణవణువును
ఆక్రమిస్తూ సర్వందోచేసే
దోపాడిదారుల కబంధసస్తాలలో ఎప్పుడు బంధియే నా భరతమాత
అన్నపూర్ణగా విలసిల్లిందొకపుడు
దేశానికి వెన్నుముకలు రైతన్నలనాడు దేశాభివృద్ధికై
స్వేదం చిందిస్తూ కల్తెరగని మనసులతో మనుషులతో
నిజమై బలమై మూలస్తంభమై
దేశనిర్మణానికై అహర్నిశలు
పాటుపడేవాడు
కాని 
నేడు కార్పొరేట్ 
కల్తీ ప్రపంచంలో కాలుష్యం కాటుకుబలై 
భూమిని
నమ్ముకున్నవాడు నేడమ్ముకుంటున్నడు
కారణం నేటిరాజకీయం
నల్లచట్టాలనెన్నో చేస్తూ
రైతును కటిక దారిద్య్రంలోకి
నెట్టేస్తుంటే 
పిడికిళ్ళన్నొకటై తిరుగుబాటు బావుటాతో బజారుకెక్కినవైనం
సన్యాసులకు సైతం అధికారదాహం
ప్రభుత్వ సంస్థలన్నీ పరాయికరణ
బీదవాడిని పాతచిరునామాకే సాగనంపుతున్నరు
తాగుడుకు బానిసనుజేస్తూ
అదిగమించని అంధకారంలో
తాయిలాల గోతిలోకి తోస్తూ తందనాలుడుతున్నరు

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు

0/Post a Comment/Comments