పసిపాప(బాలగేయం)-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

పసిపాప(బాలగేయం)-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

పసిపాప
(బాలగేయం)
----------------------------------//
పసిపాప నవ్వితే!!
పండు వెన్నెల కురియు
పసిమి ఛాయలు ఇంట
పూగుత్తులై విరియు

పసిపాప పలికితే !
తేనెలే!! ప్రవహించు
పండుగై హృదయాన
పరవశం కల్గించు

పసిపాప హృదయమే!
ప్రభాకరుని ఉదయమే!

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు 

0/Post a Comment/Comments