బహుజనుడా మేలుకో ---సి. శేఖర్(సియస్సార్)

బహుజనుడా మేలుకో ---సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: బహుజనుడా మేలుకో!

వ్యవస్థ వ్యక్తికోసమైపాయే
చేవచచ్చిన చేతకానితనం
నరనరాన ఆవహించి
ప్రశ్నించడమే మరచిపొయే
అవస్థలు 
విన్నవించుకోవాలో
దిగమింగుకోవాలో
ఊపిరాడక తనువు చాలించాలో
నేడు దీనావస్థ ప్రతి గుండెలో
నిక్షిప్తమై ప్రాయశ్చిత్తమేదో
దిక్కుతోచని జీవనగమనం
పిడికిలెత్తడం మరచిన మౌనస్థితి
ఎది‌రించడమేనాడో మరచిపోయి
పక్షవాతంతో పరుపులోనే మౌనంగా హాహాకారాలు
కుక్కకు బొక్కేసినట్టు
ఉచిత పథకాలిసిరేసే రాజ్యంలో
ధర్జాగా దోపిడికి ఆలవాలమై అప్పులనావలోనే పయనం
తీరంచేరని జీవితాలేనన్ని
బానిసతనానికి చేరువలో
భావిపౌరుల జీవితాలు
నాయకత్వం పన్నే రాజకీయ పన్నాగంలో  
బహుజనులే భజనపరులు
పాదపూజలొదిలితే
మోసే జెండాలు దించితే
ప్రజాస్వామ్యం దేశంలో
నీ చేతిలోని
వజ్రాయుధాన్నొక్కసారి 
మత్తువదిలి వాడిచూడు
మరోలోకమిక్కడే కళ్ళముందావిష్ర్కుతమవుతుంది
బానిస బతుకులేదక్కడ
నీవనుకున్న బావిభారతం 
బాంఛన్ బతుకుకు తావేలేదక్కడ
బహుజనుడా మేలుకో
నీ రాజ్యం నీవేలుకో!!

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

0/Post a Comment/Comments