అ(పా)డుకుందాం!!
------------------------------------
బొమ్మతో ఆడుకుందాం
అమ్మతో పాడుకుందాం
కొమ్మలపై ఫలముల్లా!!
కమ్మగా ఉపకరిద్దాం
నాన్న మాట ఆలకిద్దాం
అన్నలకు! తోడుగుందాం
సన్నజాజి పూవుల్లా!
మిన్న తావులందిద్దాం
మొక్కల్లా ఒదిగుందాం
అక్కలకు అండుందాం
చక్కనైన దారుల్లో
చుక్కల్లా వెలుగిద్దాం
చెల్లితో కలసివుందాం
పల్లెలో తిరిగి వద్దాం
చల్లనైన వెన్నెల్లో!!
మల్లెల్లా వికశిద్దాం
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.
------------------------------------
బొమ్మతో ఆడుకుందాం
అమ్మతో పాడుకుందాం
కొమ్మలపై ఫలముల్లా!!
కమ్మగా ఉపకరిద్దాం
నాన్న మాట ఆలకిద్దాం
అన్నలకు! తోడుగుందాం
సన్నజాజి పూవుల్లా!
మిన్న తావులందిద్దాం
మొక్కల్లా ఒదిగుందాం
అక్కలకు అండుందాం
చక్కనైన దారుల్లో
చుక్కల్లా వెలుగిద్దాం
చెల్లితో కలసివుందాం
పల్లెలో తిరిగి వద్దాం
చల్లనైన వెన్నెల్లో!!
మల్లెల్లా వికశిద్దాం
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.