" హితోక్తులు "
------------------------------
కల్గియుండు అణకువ
అదే కదా వేకువ
వీడరాదు తేకువ
కాకూడదు లోకువ
మితిమీరిన గర్వం
హరిస్తుంది సర్వం
జీవితాన వినయం
చేకూర్చును విజయం
హద్దులేని స్వార్ధం
లేదు అందు అర్ధం
తెలీక పరమార్థం
ఎంత ఉన్న వ్యర్థం
ఆరోగ్యం హాసం
మోమున మధుమాసం
శృతిమించిన హాస్యం
చివరికి అపహాస్యం
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు