శీర్షిక: గాలిమేడల బడ్జెట్. పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: గాలిమేడల బడ్జెట్. పేరు: సి. శేఖర్(సియస్సార్)


శీర్షిక: గాలిమేడల బడ్జెట్

ఏ.సి గదుల్లో
కార్పొరేట్ కాలర్ల కనుసన్నల్లో
పురుడుపోసుకుని
ముస్తాబైంది బడా బడ్జెట్
నా దేశమెపుడు ఉన్నతులచేతుల్లో బందియే
పేదవాడసలు కనబడడు 
అ ఆద్దాలమేడల్లో
నాయకుడెంతటోడయిన
వాడు ఓ రాజకీయ నాయకుడే
అధికారానికి రుచిమరిగిన మేకవన్నెపులులే వారంతా
బీదోడి డొక్కలెండిన ముక్కుపిండైనా ఉన్నోడికవసరమైన నల్లచట్టాలు చేయడం
దేశాన్నంతా దోచిపెట్టడమే
ఆనవాయితిక్కడ
నిర్మలసురగంగా సంగమక్షేత్రం
అంబానీ ఆదానీలాంటివాళ్ళే
మన భారతదేశం
సంపన్నులనూరడించడానికే
పనులైనా పన్నులైన
స్వేదం చిందించే మనుషులకు
విలువే లేదిక్కడ
కూడూగూడూ లేని నిరాశ్రయులెందరో అడుగడుగునా అగుపడినా
చూడనేచూడరసలు
వేతనజీవులందరూ దేశాభివృద్ధికి చేయుతనిస్తుంటే 
వారిఘోస వినిపించదు కనిపించదు
ప్రజలయాతన పక్కకు నెట్టి
నిర్భయంగా నిర్ధాక్షిణ్యంగా
కార్పొరేట్ కాలర్స్ కు కాపాలదారులవుతున్న ఏలికలు నేటి పాలకులు
దేశాన్నంతా ప్రైవేటుకు ధారదత్తం చేస్తున్న వైనం

సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments