శివోహం

శివోహం

శివోహం

ప్రణవ మధుధూపం రగిలించా !
మమతా ప్రియ కర్పూరం వెలిగించా !
జ్ఞానమయ సిరి దీపంలో నిను ఆరాధిస్తున్నా !
వినమ్ర భావధారతో అభిషేకించా !
ధ్యానమయ నయనంతో
నాహృది పుష్పాన్ని నీపాదాలచెంతుంచా !
అయినా 
నీవు కరగని హృదయానివని
నీ భోళామయం ఏమైందని
బాధిస్తున్నా ...
నేను
నిను వీడని ప్రేమమయ శిల్పిని 
నీ నామం వదలని మనోతపస్విని 
నిను ఎదలో ప్రాణంగా నింపుకున్న భావహంసని
అందుకే 
నా మధనంలో జ్వలించే
నీమధురం ఆస్వాదిస్తున్నా...
నీ పంచాక్షర కవనంతో
నిరతరం పరవశిస్తున్నా...
నీ కోసం ఎదురుచూస్తూనే ఉంటా
ఈ జన్మంతా...!
నీవు...నేను ఒకటని
శివోహం...తో

రచన 
డా!! బాలాజీ దీక్షితులు పి.వి
శ్వేత శిక్షణా సంస్థ, తితిదే, తిరుపతి
8885391722

0/Post a Comment/Comments