కవిసమ్మేళనం

కవిసమ్మేళనం

*ప్రపంచ రికార్డ్ కవి సమ్మేళనం* నెలకొల్పబోతున్న *కవితోత్సవానికి కవివర్యులకు సాదర స్వాగతాహ్వానం.*

*అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అయిన శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో తెలుగు కవితోత్సవాన్ని మార్చి 12, 13 తేదీలలో 24 గంటల 24 నిమిషాల, 24 సెకన్ల పాటు నిర్విఘ్నంగా జరిపి ప్రపంచ రికార్డును సొంతం చేసుకోనుంది. ఈ కవి సమ్మేళనంలో పాల్గోనే అద్భుత అవకాశాన్ని కవులు వినియోగించుకొని ప్రపంచ రికార్డ్ లో భాగస్వామ్యం అవ్వాలని, కాగలరని శ్రీశ్రీ కళా వేదిక - కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జెట్టబోయిన శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు చౌకి.రాజేంద్ర గార్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వేదికగా శ్రీశ్రీ కళా వేదిక చైర్మన్ డా"కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి అధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమానికి హాజరైన ఆత్మీయ  కవులరందరికీ ఉచిత వసతి మరియు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు.*
*తెలుగు వెలుగులు పంచుతూ కవులను ప్రోత్సహించాలి, కవిత్వాన్ని బ్రతికించాలి అనే నినాదంతో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఇందులో కామారెడ్డి జిల్లాకు సంబంధించి పాల్గొనదలచిన కవులు 9666244668 లేదా 9492474855 లకు వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరని తెలిపారు.*

0/Post a Comment/Comments