ఉద్యమ శక్తి ని రుజువు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సిబ్బంది. పాలకులు దిగి రావాల్సిందే నని చాటిచెప్పిన "చలో విజయవాడ". ఉద్యోగ,ప్రజా పోరాటాలను ఏ శక్తి అడ్డుకోలేదు నిజం!! నిజం!!!

ఉద్యమ శక్తి ని రుజువు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సిబ్బంది. పాలకులు దిగి రావాల్సిందే నని చాటిచెప్పిన "చలో విజయవాడ". ఉద్యోగ,ప్రజా పోరాటాలను ఏ శక్తి అడ్డుకోలేదు నిజం!! నిజం!!!

ఉద్యమ శక్తి ని రుజువు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సిబ్బంది. పాలకులు దిగి రావాల్సిందే నని చాటిచెప్పిన "చలో విజయవాడ". ఉద్యోగ,ప్రజా పోరాటాలను ఏ శక్తి అడ్డుకోలేదు నిజం!! నిజం!!!
- వడ్డేపల్లి మల్లేశము9014206412
   
న్యాయమైన ప్రజా ఉద్యమాలకు ఏ ప్రభుత్వం అయినా తల వంచక తప్పదు. ఆధిపత్యాన్ని ప్రదర్శించి, అహంభావంతో ఉద్యోగులను అవమానించే ధోరణి ఇటీవలికాలంలో ఎక్కువగా కనపడుతున్నది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ ధోరణి ఆందోళన కలిగించడమే కాకుండా పాలకులకు సవాలుగా మిగిలిందని కూడా గుర్తించాలి.                                    
ఉద్యమాలను నీరుగార్చాలనే ధోరణితో పాలకులు అనేక కఠిన నిర్ణయాలు, నిర్బంధాలు, అణచివేత, ఆధిపత్య ధోరణి తో పోలీసులను ఉసిగొల్పి అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంలో అర్థం ఉందా? సమస్యల పైన పోరాడుతున్న పోలీసులకు జవాబు చెప్పాల్సింది అధికారులు, మంత్రులు, చివరి ముఖ్యమంత్రి  అంతేకానీ ఉద్యోగ శక్తిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రవేశించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇకనైనా గ్రహించాలి . దానికి తగిన ఉదాహరణ ఫిబ్రవరి మూడవ తేదీన విజయవంతమైన" చలో విజయవాడ".....
     
ఉద్యోగులను రెచ్చగొట్టడం సమంజసమేనా?:-

సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ అందుకు సంబంధించిన కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయడం అనేది కనీస ధర్మం.  అశుతోష్ మిశ్రా వేతన కమిటీ నివేదికను వెల్లడించకుండా కార్యదర్శుల కమిటీ, ఆ తర్వాత మంత్రుల కమిటీ వేసి కాలయాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా ఉన్నవి.

ఇంటి అద్దె అలవెన్సు ల గ్రూపుల ను మార్చడం వలన చాలామంది ఉద్యోగులకు హెచ్ఆర్ తగ్గినది. 27 శాతంగా ఇచ్చినటువంటి మధ్యంతర భృతి ని కాదని ఇటీవల చర్చల్లో 23 శాతంగా ఫిట్మెంట్ను ప్రభుత్వం అంగీకరించడం ఉద్యోగులను మోసగించడ మే. అంతేకాకుండా ఇక నుండి పిఆర్సి 10సంవత్సరాలకు ఒకసారి అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సూచనప్రాయంగా  ప్రకటించడం ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ ను ఎక్కువగా ఇచ్చి వేతన సవరణ చేస్తారు. కానీ దానికి భిన్నంగా ముఖ్యమంత్రి స్థాయిలో  జరిగిన  తదితర అసంబద్ధ నిర్ణయాలను ఉద్యోగులు వ్యతిరేకించి గత నెల రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. Feb 6 తేదీ నుండి సమ్మెకు నోటీసు ఇచ్చినటువంటి  పిఆర్సి సాధన సమితి నాయకులు రాష్ట్రంలోని 15 లక్షల మందిని కదిలించిరోజుకొక రూపంలో ఉద్యమాన్ని సాగిస్తున్నందుకు  తెలుగు రాష్ట్రమైన తెలంగాణ  ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నది.
      
ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం నేర్పాలి:-

ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో నైనా ఉద్యోగ వ్యతిరేక విధానాలనే అవలంభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకున్న తెలంగాణలో ఉద్యోగుల చావులే ఇందుకు సాక్ష్యం. ప్రజా వ్యతిరేక విధానాలతో రాజకీయాలు నడిపినట్లు గా ఉద్యోగుల హక్కులను కాలరాయడానికి  ప్రభుత్వాలు ఎప్పుడూ వెనుకాడవు. అందుకు పోరాటాలే శరణ్యమని చరిత్ర రుజువు చేసింది. గతo నుండి వర్తమానం ద్వారా భవిష్యత్తులో కి వెళ్లడానికి ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్ట వలసిందే. అందులో భాగమే ఉద్యోగ సంఘాల  ఆత్మగౌరవ పోరాటం(A.P.)  ఉద్యోగులు ప్రజల్లో భాగమేననే మౌలిక అవగాహన లేని ప్రభుత్వాలు ప్రజల నుండి ఉద్యోగులను వేరు చేసే కుట్ర దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మినహాయింపు కాదు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే తెగేదాకా లాగే పద్ధతి లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అరకొరగా చర్చలు జరిపినప్పటికీ ప్రధానమైన డిమాండ్లను అంగీకరించకపోవడంతో తలపెట్టిన చలో విజయవాడ ఉద్యోగ సంద్రమై అధికార పీఠాన్ని కదిలించింది అనడంలో సందేహం లేదు.
     
ఉద్యోగ శక్తి కి అభివందనాలు:-
   
15 లక్షల ఉద్యోగుల పక్షాన పిఆర్సి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని నలుమూలల నుండి విజయవాడ చేరుకోవడానికి ఉద్యోగులు ప్రదర్శించిన చొరవ, పోరాట స్ఫూర్తి ,ప్రదర్శించిన ఎత్తుగడలు, వ్యూహాలు అద్భుతం.! అమోఘం"! ఆచరణీయం కూడా!. అవసరమైతే మారువేషాల్లో పోలీసులను తప్పించుకుంటూ వాహనాలు రైళ్లు బస్సులు ప్రైవేటు రవాణా మార్గం ద్వారా విజయవాడ చేరుకుని ప్రభుత్వాన్ని కదిలించడమే కాదు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటం ప్రభుత్వాన్ని నివ్వెరపరిచింది.

నింగిలో చరిత్రగా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి గత రెండు మాసాలకు పైగా జరుగుతున్నటువంటి 317 జీఓ కారణంగా ఇప్పటికే 40 మంది ఉద్యోగులకు పైగా బలవన్మరణాలు ఆత్మహత్యలు గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాలలో పోరాటాలు తీసుకున్నా ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాల మాదిరిగా బలప్రదర్శనతో ప్రభుత్వాన్ని కదిలించ లేకపోవడం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కనీసం బదిలీలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక సౌకర్యాలు పొందినటువంటి ఉద్యోగులు సొంత రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడ వలసి  రావడాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని ఆంధ్ర ఉద్యోగుల బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది..
     
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమర్శలు:-

గమ్మత్తయిన విషయం ఏమిటంటే విడతలుగా మంజూరు చేయవలసిన డీఏ లను ఒక్కసారి మంజూరు చేసి బకాయిలతో సహా జీతాలు పెరిగాయి కదా! అని చెప్పడం ప్రభుత్వం యొక్క మూర్ఖత్వమే. చర్చల సందర్భంగా అధికారులతో పాటు ప్రభుత్వ సలహాదారు పాల్గొన్న సందర్భంలో డి ఏ లు ఇతరత్రా కారణాల వల్ల వేతనాలు పెరిగాయి కదా! అని చెప్పడం అధికారుల మంత్రుల అవివేకానికి నిదర్శనం. అధికారులు మంత్రుల బృందం ఉండగా  ఉద్యోగుల సమస్యల పైన ప్రభుత్వ సలహాదారు పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమే .ఎందుకంటే ప్రభుత్వ సలహాదారు అనే పదవి రాజ్యాంగబద్ధమైనది ఏమీ కాదు. ప్రభుత్వానికి వంతపాడే ధోరణి గా వివిధ దశల్లో చర్చలు జరిపినపుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పాత వేతనాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా పిఆర్సి ఉత్తర్వులు వెలువరించి జనవరి వేతనాన్ని ఎటు కాకుండా చేసినటువంటి ప్రభుత్వ పాలసీని నిరసిస్తూ ఉత్తర్వులను కాలబెట్టిన సంగతి మనందరికీ తెలిసినదే.

     ప్రశ్నించడం, వ్యతిరేకించడం, చలో విజయవాడ కార్యక్రమాన్ని తీసుకోవడం, చివరికి సమ్మె నోటీసు ఇవ్వడం, ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతూ నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో ఉత్తర్వులను ఇచ్చి మొండిగా వ్యవహరిస్తున్న టువంటి అక్కడి ప్రభుత్వాన్ని ఏమనాలో? ప్రజలు కూడా ఈ సందర్భాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నది. అమరావతి ని వదిలి పెట్టి 3 రాజధానుల ప్రతిపాదనకు ప్రభుత్వం సిద్ధపడి ప్రజల ఆకాంక్షలకు నీళ్ళు వదిలిన ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి  ఉద్యోగులతో ప్రజలు జతకలిసి పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని ప్రజలు గ్రహించాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాలు కూడా ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి అణచివేత నిరంకుశత్వాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. తద్వారా మాత్రమే ప్రభుత్వం ఒక అడుగు దిగి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగులకు తలవంచి రాజీపడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రజల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడాలంటే  సమైక్య ఉద్యమం ఎంతో అవసరం. ఇది చరిత్ర నుండి నేర్చుకున్న గుణపాఠం.

 ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్సు లను గతంలోకంటే మరింతగా పెంచి, ఐదు సంవత్సరాలకు పి ఆర్ సి వర్తింప చేయడానికి అంగీకరించి, మధ్యంతర భృతి ఇచ్చినటువంటి 27 శాతానికి మించి పిఆర్సి ఫిట్మెంట్ ను ఆమోదించి ,ఉద్యోగుల మిగతా సమస్యలను పట్టించుకోని పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి బ్రతుకుదెరువు ఉంటుంది. లేకుంటే ప్రజలు ప్రజాస్వామిక వాదులు వివిధ రకాల ఉద్యమకారుల పోరాట ప్రవాహంలో  పాలకులు కొట్టుకుపోక తప్పదు . ఈ సందర్భం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ, హక్కులను కొల్లగొడుతూ, ఆధిపత్యాన్ని  ప్రదర్శిస్తూ, అనైతిక పద్ధతులకు పాల్పడుతున్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా చెంపపెట్టు కావాల్సిందే.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

0/Post a Comment/Comments