నేను మంచివాడిని ఎట్లౌతాను ---

నేను మంచివాడిని ఎట్లౌతాను ---

నేను మంచివాడిని ఎట్లౌతాను 


కడలి కల్లోలభారతంలో 
 హత్యలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు, 
ఆర్తనాదాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా 
అసమర్డుడనై చూస్తున్నా 
ఇంకా నేను మంచి వాడిని ఎట్లేతను.

ప్రపంచం లో ఎక్కడా లేని నా అఖండ భారతి లో 
మతం మత్తులో, కులం కుళ్లు తో
కంపరం పుట్టించే కంపు వాసనలతో
కాశాయపు మంటల్లో కాలి బూడిద అవుతుంటే 
ఏమి చేయలేని చవట నైచూస్తున్న 
ఇంకా నేను మంచి వాడిని ఎలా అవుతాను.
     
 పంట పండించడానికి ఆంక్ష , 
తిండి తినడానికి ఆంక్ష, 
నా ఆలోచనకుఆంక్ష, 
నేను రాసే కలానికి ఆంక్ష, 
నే పాడే గళానికి ఆంక్ష,
నా పరిశీలన చూపులకుఆంక్ష
చివరగా నాకు కళ్లెం వేయడానికినా 
పాలిగాల్లే నాకు శాసనం రాస్తున్నా
ఏమి చేయలేక ఎదురు చూస్తూనే ఉన్నా
ఇంకా మంచి వాడిని ఎట్లైతాను.
                 
 ఎండిన కడుపుల బొక్కల చూసి
మోరీల అంచున గుడారపుగుడిసెల చూసి 
పౌష్ఠికాహారం చూడని నా బాలల చూసి 
వారి చర్మాలే చద్దర్లుగా చేసి 
రక్త మాంసాల మీద కప్పుకునే చీకటి
బ్రతుకుల చూసి కంటి దార రాల్చాను తప్ప 
ఇదేంటని ఎవరిపై గాండ్రించలేదు
ఇంకా నేను మంచివాడిని ఎట్లౌతానూ

చదివే చదువులు హైందవమైతే
వైజ్ఞానికానికి సమాధి కడితే
అందవిశ్వసాలు అందల మెక్కితే
జనాల మెదల్ల నరాలు పీకుతే
ప్రశ్నించే గొంతులు నొక్కి జైళ్లలోనకేసులు పెట్టి 
అణచేసిన పాలన యంత్రం
ఏంచేసినా నేను మిన్నకుండిపోయాను
అందుకే నేను మంచోడిని ఎట్లైతాను

వ్యసనాలను మనం అవసరమైతేఆహారమై 
మన మనుగడ పోతేఅర్దం లేని జీవితానికి 
మనం అంగీకారం తెలుపుకున్నట్టే అందుకే
చైతన్య దీప్తివై, విప్లవ శంఖానివై 
వేయి వెన్నెలల వెలుగులు నీవై
దోపిడి లేని దాపులు తేవ నా కోసంవస్తుంటే 
నీకోసమే నీ నీడగా నేనుఉంటూ...
జనతా ప్రజా తంత్ర విప్లవంతెచ్చి
సుఖ శాంతుల భారతావని నిర్మిస్తే నే.....కదా
నేను మంచొడిని అవుతాను......

..పురుషోత్తం సతీష్
కరీంనగర్, 8897430904
15-2-22. 12.10pm.

0/Post a Comment/Comments