మేధావుల మౌనం, ప్రశ్నించలేని ప్రజల అమాయకత్వం జన జీవితానికి జాతి ఉన్నతికి అత్యంత ప్రమాదకరం. ఇది సమాజ ఎదుగుదలను భ్రష్టు పట్టిస్తుంది!!!

మేధావుల మౌనం, ప్రశ్నించలేని ప్రజల అమాయకత్వం జన జీవితానికి జాతి ఉన్నతికి అత్యంత ప్రమాదకరం. ఇది సమాజ ఎదుగుదలను భ్రష్టు పట్టిస్తుంది!!!

 మేధావుల మౌనం, ప్రశ్నించలేని ప్రజల అమాయకత్వం జన జీవితానికి జాతి ఉన్నతికి అత్యంత ప్రమాదకరం. ఇది సమాజ ఎదుగుదలను భ్రష్టు పట్టిస్తుంది!!!

---వడ్డేపల్లి మల్లేశము9014206412



        " మేధావుల మౌనం మూర్ఖుల సంఖ్యను రెట్టింపు చేస్తుంది. ఇది ఎదిగే సమాజానికి అత్యంత ప్రమాదకరం"

                      - నెల్సన్ మండేలా


        దక్షిణాఫ్రికా నల్ల సూరీడు జాతి వివక్షతకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రాజ్యాధికారాన్ని చేబూని ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిన దక్షిణాఫ్రికా స్వాతంత్ర యోధుడు నెల్సన్ మండేలా అన్న మాటలు వివక్షత ఉన్న ప్రతి చోటా వర్తిస్తాయి. కులం, మతం, ప్రాంతీయత, భాష, లింగపరమైన వ్యత్యాసాల కారణంగా భారతదేశంలో ఈ వివక్షత మరింత ఎక్కువగా ఉందనడంలో సందేహం లేదు.

 తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారం లేని కారణంగానే దక్షిణాఫ్రికాలో నల్లవాళ్లు తెల్ల వాళ్ళ హింసకు బలి అయినారు. ఆ వివక్షత నుండి రగిలిన పోరాట కాంక్ష ప్రపంచానికి తగిన గుణపాఠం ఇచ్చినది. ప్రశ్నించి, ప్రతిఘటించి, బెదిరించి, నిలదీసి, హక్కులకై కలబడి బాధ్యతలకు నిలబడిన కారణంగానే నెల్సన్ మండేలా హక్కుల కార్యకర్తగా ప్రపంచ స్థాయి మేధావిగా గుర్తింపు పొందాడు.

    తన అనుభవాలను, జ్ఞాపకాలను, పొందిన అవమానాలను, చిత్ర హింసలను ప్రపంచవ్యాప్తంగా ఇకముందు ఏ జాతికి ఏ తరానికి అనుభవంలోకి రాకుండా ఉండాలని పోరాడితే పోయేదేమీ లేదని ఇచ్చిన సందేశం నేడు ప్రపంచాన్ని చైతన్యం వైపు నడిపిస్తున్నది.

        మండేలా సూక్తిని విప్పి చెబితే:-

**************

     ప్రాంతం ఏదైనా ఆధిపత్యం ఉన్న చోట, ప్రజలను బానిసలుగా మార్చుకున్న చోట, ప్రశ్నించకుండా నిలదీయకుండా అణచివేత కొనసాగిన న్నిరోజులు ప్రజలు మౌనంగా ఉంటారు కావచ్చు. కానీ ఆత్మస్థైర్యాన్ని పుణికిపుచ్చుకొని, ఆవేదన ఆందోళన అవమానాలను మనసులో నిలుపుకొని, కారణాలను వెతికి, కార్యాచరణకు పూనుకున్ననాడు బానిసలే బల్లెములై శత్రువులపై దాడి చేస్తాయి." సాగినంత కాలం నా అంత వారు లేరు అందురు సాగక పోయిననాడు చతికిలబడి పోదురు". అన్న సినిమా  గీతంలోని వాస్తవము కూడా అ చేతనత్వాన్ని - చైతన్యాన్ని విడమరిచి చెప్పడమే.

       అందుకే నెల్సన్ మండేలా ఏ దేశంలోనైనా ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులు మౌనంగా ఉండడం రాజ్య సంక్షేమం అభివృద్ధి రీత్యా ప్రమాదకరమని తద్వారా మూర్ఖులు నేరగాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నాడు. ఇది ఎదుగుతున్న సమాజానికి జాతి ఔన్నత్యాన్ని కి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తుందని  తన సూక్తిలో హెచ్చరించాడు. "మేధావులు మౌనంగా ఉండటం అంటే పరోక్షంగా రాజ్యానికి సహకరించడమే. మరికొందరు కవులు కళాకారులు మేధావులు గుడ్డిగా ప్రభుత్వ విధానాలను ఆమోదించడం కూడా మౌనం కిందికే వస్తుంది. ఈ రెండు రకాల మౌనాలు  అత్యంత ప్రమాద కారులు. అంతే కాదు సామాన్య అట్టడుగు మధ్యతరగతి ప్రజల పాలిట దుఃఖాశ్రువులు".

       ఇక మేధావులు అంటే పరిమితమైన అర్థంలో కాకుండా manasundi, ప్రశ్నించడానికి వ్యావహారికసత్తావాదం కలిగి ఉండి, నిక్కచ్చిగా నిలదీసి, హేతుబద్ధంగా ఆలోచించి, పాలకుల అకృత్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను నిలదీసేవాళ్లే మేధావులని చెప్పుకుంటే దానికి పూర్తి స్థాయిలో సార్థకత చేకూరుతుంది. ప్రజాస్వామ్యంలో జాగరూకులైన ప్రజావళి ఎంత ముఖ్యమో చట్టసభలు చట్టసభల బయట విభిన్న వేదికలపైన ప్రజలకు సంబంధించిన పాలన అంశాలు చర్చించి విమర్శించి సూచనలు చేయగలిగే ప్రజాస్వామిక దృక్పథం కూడా అంతే అవసరం. మరొక రకంగా చెప్పాలంటే "ప్రజాస్వామ్యమంటే ప్రశ్నించి నిలదీసి ప్రభుత్వాలు వక్రమార్గం పట్టకుండా, పాలకులు పెట్టుబడిదారుల వర్గానికి వత్తాసు పలకకుండా గాడిలో పెట్టగలిగే ఒక జీవన విధానం... ఒక పాలనా విధానం అని అర్థం".

        ప్రస్తుతం మేధావుల మద్దతు ఎటువైపు

     ****************

     ముఖ్యంగా హక్కుల కార్యకర్తలు కవులు కళాకారులు విశ్లేషకులు నిరంతరం ప్రజా పాలన ను కనిపెట్టి ఉంటారు. అవసరమైనచోట సూచనలు చేస్తూ పాలన గాడి తప్పకుండా సరి చేస్తారు. కానీ నేటి ప్రభుత్వాలు కుటిల రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రశ్నించిన వాళ్లను నిర్బంధించి, దేశ ద్రోహులుగా ముద్ర వేసి, సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించి కారాగార శిక్షలు విధించడం పరిపాటి అయిపోయింది. ప్రజల మధ్య ఉండవలసిన మేధావులు, బుద్ధిజీవులు, హక్కుల కార్యకర్తలు, మనసు ఉన్న వాళ్ళు, వ్యవహారిక గాన జ్ఞానం కలిగిన వాళ్ళు పేదరికంతో అలమటిస్తూ జైల్లో నిర్బంధించబడి శిక్షలు అనుభవిస్తూ ఉంటే నేరగాళ్లు చట్టసభలలో రాజ్యమేలుతున్నారు. 83% లోక్సభ సభ్యులుగా  నేరగాళ్లు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతుంటే భారత ఎన్నికల సంఘం ఏం చేస్తుందో భారత న్యాయవ్యవస్థ  ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పడినవి. సంపద కేంద్రీకృతమై దారిద్ర్య రేఖ దిగువన కలిగిన పేదవాళ్ళు, కుబేరుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే సామాన్యుల సంగతి ఏమిటో ఆలోచించండి! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ దేశాన్ని పాలించే అర్హత ఉన్నదా? అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కొంత మంది మేధావులు ప్రభుత్వానికి గుడ్డిగా మద్ద తీయడం అత్యంతవిచారకరం.                       

రాజ్యాంగం మార్చాలి అట:-

*******

   రాజ్యాంగం లో ఉన్నటువంటి అనేక అంశాలను అవకాశాలను ఉపయోగించి ప్రజల కోసం పరిపాలించ వలసిన రాజకీయ నేతలు, పాలకుల ధోరణి రోజురోజుకు వికృతంగా మారుతున్నది. సందర్భోచితంగా అప్పుడప్పుడు తమ మనసులో ఉన్న కుట్ర ను బయట పెట్టడానికి "రాజ్యాంగాన్ని మార్చాలి" అని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో మనసులో పెట్టుకున్న ఈ భావాన్ని తెలియకుండా వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తూనే ఉన్నది. చివరికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు సామాన్య ప్రజానీకానికి ద్రోహం చేయడానికి నేటి రాజకీయ వ్యవస్థ సిద్ధంగా ఉన్నట్లు... ఆ ప్రమాదాన్ని పసిగట్ట వలసిన అవసరం మన అందరి పైన ఉన్నది. అందుకే అణువణువునా ప్రతిచోటా ప్రశ్నించకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించడం మన నైజం! మన ప్రాథమిక హక్కు! అదే అక్రమార్కుల పైన ఉక్కుపాదం.!

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం).

0/Post a Comment/Comments