ఎక్కడ..... ఆ చిరునామా -డా. చిటికెన కిరణ్ కుమార్

ఎక్కడ..... ఆ చిరునామా -డా. చిటికెన కిరణ్ కుమార్

  ఎక్కడ.....  ఆ చిరునామా
===================

ఓ సత్యమా... 
ఎక్కడ నీ చిరునామా...

 అనాధల ఆకలి 
కడుపుల్లో  
ఉన్నదా నీ చిరునామా... 

 ఆ లంచగొండి
తనంలో 
ఉన్నదా నీ చిరునామా...  

మరి  అభాగ్యుల 
జీవితాల్లో 
ఉన్నదా  నీ చిరునామా... 

 నిజాయితీ లేని 
గుండెల్లో 
ఉన్నదా నీ చిరునామా... 

 మానవత్వం లేని 
క్రూరుల్లో 
 ఉన్నదా నీ చిరునామా... 

 వరకట్న గుండె 
రక్కసి లో 
ఉన్నదా నీ చిరునామా... 

 క్షణికావేశంలో ఆత్మహత్య
 గుండె లో 
ఉన్నదా నీ చిరునామా... 

 కరుణించని కరోనా గాలి 
గమకాల్లో  
ఉన్నదా నీ చిరునామా...

 వలస కూలీల కాలే
 కడుపు  లో 
ఉన్నదా నీ చిరునామా...

 పచ్చని పంట పొలాలను 
మింగేసిన అకాల వర్షం లో 
ఉన్నదా నీ చిరునామా...

నిజాన్ని మట్టికరిపించిన 
అబద్ధం లో
 ఉన్నదా నీ చిరునామా...

 పట్టపగలు స్త్రీ కి  జరిగిన
 అన్యాయం లో
 ఉన్నదా నీ చిరునామా...

 యువతను పెడదోవ పట్టిస్తున్న
 ప్రాచ్యాత్య సంస్కృతిలో
 ఉన్నదా నీ చిరునామా...

 ఓ  సత్యమా... 
ఎక్కడ నీ చిరునామా...


-డా. చిటికెన కిరణ్ కుమార్
కథా, వ్యాస రచయిత / విమర్శకులు 
 సభ్యులు, ఇంటర్నేషనల్ బేనెవోలెంట్ ఫౌండేషన్ 


 

0/Post a Comment/Comments