నా తొలి ఇంటర్వ్యూ

నా తొలి ఇంటర్వ్యూ



నా తొలి ఇంటర్వ్యూ
          డా.. కందేపి రాణీప్రసాద్.
1983,84 ప్రాంతాలలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ లోకి చేరిన రోజులు చాలా పెద్ద పెద్ద చదువులు చేదివేస్తున్నామన్న ఫీలింగ్ ఒక్కక్కరికి మనసులో మరి నలభై ఏల్ల కిందట ఆడపిల్లలు డిగ్రీలో చేరటమంటే మాటలా.
అలా గాల్లో తేలిపోతున్న రోజులలో ఒకనాడు APPSC వారి GROUP IV నోటిఫికేషన్ వెలువడింది. ఆ ఎగ్జామ్స్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్. చాల మంది ఆప్లికేషన్లు పెడుతున్నారు. మా అన్న కొడుకులు కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండు కొడుకులు అప్లై చేస్తున్నారని మా నాన్న నా పేరు కూడా పెట్టాడు. నా క్కూడా సరదాగానే ఉంది. ఎంప్లాయ్మెంట్ లో రిజిస్టర్ చేయించుకోవటం, కాంపిటిటివ్  ఎగ్జామ్స్ రాయటం అంటే అదో గొప్ప అప్పట్లో. ఎగ్జామ్స్ కోక పుస్తకం కొనుక్కుని ప్రాక్టిస్ చెయ్యడం మొదలు పెట్టాను. అప్పుడే " ఒక చేటు మీద వంద కాకులు ఉన్నాయి. ఒక వేటగాడు తుపాకి పేల్చి ఒక కాకిని కొట్టాడు. ఇంకా చెట్టు మీద ఎన్ని కాకులు ఉన్నాయి"? లాంటి లాజికల్ ప్రశ్నలని మొదటిసారిగా చూడటం. అప్పటి దాకా స్ట్రెయిట్ గా ఉండే ప్రశ్నలకే సమాధానాలు రాసి ఉండటంతో చాలా కొత్తగా అనిపించింది.
పరిక్ష రోజు రానే వచ్చింది. మా ఊర్లో ఉన్న పెద్ద కాలేజి వి ఆర్ ఎస్ & వై ఎన్ ఆర్ లో పరిక్ష రాశాము. పరీక్షలో మా వూరి గురించిన ప్రశ్న " చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు"? వచ్చింది. దీంతో పటు ఒకావిడ బట్టలు ఉతికి ఆరేసింది. ఒక చీర ఆరడానికి 30 ని..లు పడితే పది చీరలు ఆరడానికి ఎంత టైం పడుతుంది? వంటి ప్రశ్నలు ఇచ్చారు. విజయవంతంగా పరిక్ష రాసి వచ్చాం.
తీరా రిజల్ట్స్ వచ్చాక చూస్తే నాతో పాటు ఎగ్జామ్స్ రాసిన వారెవరూ క్వాలిఫై కాలేదు. నేనొక్కదాన్నే క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత నాకు ఇంటర్వ్యు లెటర్ కూడా వచ్చింది. నాకైతే ఏమీ తెలియలేదు గానీ మా నాన్న మాత్రం చాల సంతోషపడ్డాడు. ఏమేమి జాబ్స్ వస్తాయని అందర్నీ ఎంక్వైరీ చేశాడు. అన్నింటికన్నా ఇంటర్వ్యూ చేసేది జిల్లా కలెక్టర్ అన్న విషయం నన్ను బాగా ఆకర్షించింది.
ఆ రోజుల్లో టివీలు లేవు. న్యూస్ పేపర్లు కూడా రెండు మూడు తప్ప ఎక్కువగా లేవు. జిల్లా కలెక్టర్ ఎలా ఉంటారో ఎవరికీ తెలిదు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గా అప్పుడు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ గారు పని చేస్తున్నారు. ఇంటర్వ్యూ లెటర్ వచ్చిన దగ్గర్నుంచి నేను కలెక్టర్ ను చూడబోతున్నామని అరువ వచ్చారు.మా నాన్నేమో ఉద్యోగం వచ్చేసి నట్లే అన్నంతగా ఆనందపడుతున్నాడు. అప్పటికి నాకు NSS లో సర్టిఫికేట్, కాలేజి స్థాయి రన్నింగ్ రేస్ మరియు వ్యాసరచన పోటిలలో పది సర్టిఫికెట్లు వచ్చి ఉన్నాయి. ఇలాంటి సర్టిఫికెట్లు ఉద్యోగం ఇవ్వటంలో ఉపకరిస్తాయని చాలా మంది చెప్పటంతో మా నాన్న కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎదో గొప్ప కోసమే గానీ ఉద్యోగం చేయించటం మా నాన్నకీ ఇష్టం లేదు. నాకూ ఇష్టం లేదు.
ఇంటర్వ్యూ రూము లో కెళ్ళి కూర్చున్నాను. కలెక్టర్ గారు ఎదో ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఒకే నీ సబ్జెక్టు లోనే అడుగుతాను. లెగూమినోసి ప్యామిలీ ప్రత్యేక లక్షణాలేంటి? అని అడిగారు. కలెక్టర్ గారు నేను ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. "ఏమ్మా! గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? అంటూ నెక్స్ట్ నెంబర్ పిలవండి అన్నారు కలెక్టర్ గారు. నేను బయటకు వచ్చేశాను. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ దగ్గర మా నాన్నతో ఆఫీసు వాళ్ళు "అబ్బే ఇవి కాలేజి లెవెల్ సర్టిఫికెట్లు. రాష్ట్ర స్థాయిలో సర్టిఫికెట్లు అయితేనే ఉపయోగపడతయంటూ తేల్చేశారు. నేను చాల ఎక్సైటింగ్ గా ఇంటికి వచ్చాను. నా లైఫ్ లో తొలిసారిగా కలెక్టర్ బంగాళా నూ , కలెక్టర్ నూ చూశానన్న ఆనందంతో.
కధ ఇంతటితో ఆగిపోతే విచిత్రం ఏముంది. కాలక్రమంలో నేను డాక్టర్ను పెళ్ళి చేసుకోవడం, రచయిత్రిగా మారడం జరిగిపోయింది. జయప్రకాశ్ నారాయణ్ గారు కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లోక్ సత్తా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. దాంతో పాటు ఒక పత్రికను కూడా నడిపించారు. అప్పుడు నేను రాసిన కొన్ని కవితలు వారి పత్రికలో ప్రచురింపబడటంతో నన్ను లోక్ సత్తా లో చేర్చుకున్నారు. విద్యవైద్యం, స్వచ్చ రాజకీయం గురించిన ఉపన్యాసాలు ప్రచురించేవారు. అప్పుడు లోక్ సత్తా రాజకీయ క్పర్తి కాదు. కేవలం స్వచ్ఛంద సంస్థ మాత్రమే కావడంతో వారు అడిగిన వెంటనే లోక్ సత్తా లో చేరాం. జిల్లా మీటింగులు పెట్టుకుని సమస్యల్ని చర్చించే వాళ్ళు. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి నాయకులూ వచ్చినా జయప్రకాశ్ నారాయణ్ గారు ఎప్పుడూ రాలేదు.
ఆ తర్వాత లోక్ సత్తా రాజకీయ పార్టీగా అవతరించింది. ఆ సమయంలో జయప్రకాష్ గారు ఒకసారి సిరిసిల్ల వచ్చారు. ఒక సభలో పాల్గొనేందుకు వచ్చారు. అప్పుడు తెలిసింది జయప్రకాష్ నారాయణ్ గారు MBBS చదివేటప్పుడు మావారికి సీనియర్ అని. మా ఊరు వచ్చిన సందర్భంగా వారికీ విందు ఏర్పాటు చేశారు.
జయప్రకాష్ నారాయణ్ గారితో నా తొలి ఇంటర్వ్యూ గురించి చెపితే పడి పడి నవ్వారు. నేను మిమ్మల్ని చూడటానికే ఇంటర్వ్యూకి వచ్చానని చెపితే సంతోషించారు. మా వారితో మెడికల్ కాలేజీ విషయాలు చర్చించారు. ఆ తర్వాత జరిగిన సభలో నా ఇంటర్వ్యూ గురించి మా వారు తనకు జూనియర్ అని సభికులకూ చెప్పి నవ్వించారు. 

ఇదీ నా తొలి ఇంటర్వ్యూ. 
గ్రూప్ IV ఎగ్జామ్స్ రాయటం. 
ఎలా ఉంది ప్రహసనం.
 

0/Post a Comment/Comments