Sent from Yahoo
పిల్లలు దేవుడూ చల్లనివారే
డా.. కందేపి రాణీప్రసాద్.
రోజంతా పుస్తకాలు పరుచుకుని వాటి మధ్యలో కూర్చొని హోంవర్క్ వ్రాస్తూ వ్రాస్తూ ఒక్కొక్కసారి ఆ పుస్తకాల మధ్యనే పడి నిద్రపోతుంటారు అలసిన పిల్లలు. సాయంత్రంపూట ఏ ఇంటి గడప చూసిన కనిపించేది అదే దృశ్యం. దీనికి మా ఇల్లు అతీతం కాదు.
ఏం చేస్తాం స్కూళ్ళలో ఇచ్చే హోంవర్క్ అలా ఉండేది. ఏ స్కూల్ ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఆ స్కూల్ చాల మంచి స్కూలని భావన. అందుకే పిల్లల ఇష్టాఇష్టాల కన్నా ర్యాంకులకే ఎక్కువ విలువ ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో చదువుకుంటున్న పిల్లలకు ఆటపాటలకు సమయమెక్కడిది? వారానికో స్లిప్ టెస్ట్ నెలకో మంత్లి టెస్ట్. క్వాటర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యు వల్స్ అంటూ ఏడాది పొడవునా పరిక్షలేకదా.ఒక్కోటి పడి ఇరవైసార్లు వ్రాసే కాపి బుక్కులు. పరిక్షలకు ప్రిపేర్ అవ్వటంతోనే సంవత్సరమంతా సరిపోతుంది. ఇంకా ఆటలకు సమయమేది? స్కూళ్ళలో డ్రిల్ పీరియాడే తీసేస్తున్నారు. అసలు ప్లేగ్రౌండ్ ఉంటె కదా డ్రిల్ పిరియడ్ లేదని బాధ కలగడానికి. ఇలాంటి పరిస్థితులలో కాన్వెంటు చదువులు చదువుతున్న పిల్లల్లో ఒబెసిటి సమస్య చాల ఎక్కువగా కనిపిస్తున్నది. ఇలా అటపాటకు శారీరక వ్యాయామానికి ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితులలో చదువుతున్న మా పిల్లలకు హెవీ ఫాట్ ఫుడ్ ఇవ్వడం తగ్గించేశాను. అప్పుడు మా వాళ్ళు ఒకటో రెండో తరగతిలోనో చదువుతున్నారు. వాళ్ళకు సెరిలాక్ తో చేసిన బిస్కెట్లు అంటే చాల ఇష్టంగా తినేవాళ్ళు. వాళ్ళు మరీ చిన్నగా ఉన్నపుడు న్యూట్రిషన్ కోసమని నేనే వాళ్లకు మనలాగా రకరకాల ప్యాషన్ డ్రస్సులు వేసుకోలేరు" అని నేనంటే పిల్లలు వెంటనే " పాపం గట్టయ్య మనలాగా ప్యాషన్ డ్రెస్సులు వేసుకోలేడు." అన్నారు. "ఇంకా చెబుతా వినండి అతనికి మన లాగా చెప్పులు, బూట్లు కూడా ఉండవు." అని నేను చెప్తూ ఉండగానే మా స్వీటీ నడుంమీద చేయ్యేసుకుని తల పైకెత్తి "అమ్మా! గట్టయ్య సైకిల్ కూడా తోక్కలేడు కదా అన్నాడు. అప్పటికింకా ఆ ఆలోచన నాకు రాలేదు. నేను ఇంకా ఏమేమీ ప్రాబ్లమ్స్ ఉండవచ్చో ఆలోచిస్తూ " అతను ఇంట్లోకి రావాలన్నా కష్టమే ద్వారం పట్టదు. బాగా వంగి లోపలికి రావాలి లేదా స్పెషల్ గా ఇల్లు కట్టుకోవాలి" అని చెప్తుండగానే చాల సీరియస్ గా వింటున్న మా మిల్కీ పక్కనే ఉన్నా మంచం వంక చూస్తున్న విషయం గమనించి "ఏంటి" అని అడిగాను. "అమ్మా అతనికి ఈ మంచం సరిపోదు కదా ఎలా పడుకుంటాడు? అని అడిగాడు. "అవునమ్మా! గట్టయ్యకు అన్నీ సమస్యలే. తినడం పడుకోవడం నడవటం ఆరోగ్యం అన్నీ కష్టమే' అని చెప్పాను. మరీ పాపం అయన ఇలా ఎందుకయ్యాడు అడిగారు పిల్లలు బాధగా మొఖం పెట్టి. హమ్మయ్య! ఇప్పుడు నా ఉపాయం ఫలించే సమయం వచ్చిందని అనుకుంటూ మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటే పొడుగు పెరుగుతారని తెలుసు కదా! అంటే అవును అని సమాధానం చెప్పారు పిల్లలు. గట్టయ్య చిన్నప్పుడు అమ్మ చెప్పిన వినకుండా హై ప్యాట్ ఫుడ్ ను విపరీతంగా తినడం వలన అలా మరీ పోడుగయ్యాడు. నెయ్యి జీడిపప్పు సెరిలాక్ బిస్కట్లు వంటి వాటిలో కొలెస్ట్రాల్ ఎక్కుకగా ఉండడం వల్ల అతిగా పొడవు పెరుగుతారు. నేను వద్దని చెప్తున్నా మీరుకూడా రోజూ సెరిలాక్ బిస్కట్లు కావాలంటున్నారు కదా! వాటిని రోజూ తింటే మీరు కూడా గట్టయ్యలాగా పొడుగైపోయి ఇల్లు పట్టకుండా చెప్పులు పట్టకుండా మంచం పట్టకుండా చాల బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు రేపటి నుంచీ ఏం చేయాలి అంటూ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి వారి వంక చూశాను. నాకు లోపల్లోపల అర్థమైందో లేదోనన్న భయం వెంటాడుతోంది. పిల్లలు వెంటనే 'మేము రేపట్నుంచి బిస్కట్లు తినం' అన్నారు. భయంభయంగా. నా ఉపాయం ఫలించిందని సంతోషంగా అనుకుంటూ వారివైపు చూశా. మా చిన్నోడు ఎదో చాల సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. మళ్ళి ఏం కొంప మునిగిందో అనుకుంటూ 'ఏంటి విషయం ' అని అడిగా. "మేము కూడా సెరిలాక్ బిస్కెట్లు తిని గట్టయ్య లాగా పొడవు పెరిగితే నువ్వెలా మమ్మల్ని ఎత్తుకుంటావు నువ్వు మోయలేవు కదమ్మా. అమ్మా నేనసలు ఆ బిస్కెట్లు తినను నువ్వు రోజూ నన్నేత్తుకో" అంటూ చంకలో చేరిపోయాడు. ఆశ్చర్యంతో నోరు తెరవడం నా వంతయింది. నేనేదో తెలివిగా అలోచించి నేనేదో తెలివిగా అలోచించి పిల్లలు అమాయకంగా ఆలోచిస్తారు. కల్మషం లేని మనసుతో చూస్తారు ఏదైనా. వారి ఆలోచనే వేరు. నాకి ఆలోచనే రాలేదు. అందుకే "పిల్లలూ దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే".
on Android