పిల్లలమే మేం పిల్లలమే (బాల గేయం)........ గుర్రాల లక్ష్మారెడ్డి.
----------------₹₹₹₹₹-----------------
పిల్లలమే మేము పసిపిల్లలమే
మల్లెలమే వసివారని మల్లెలమే
కాము మేం అల్లాటప్పా పోరలం
మేము కల్లాకపటం లేనివారలం !
గుడి గోపురాలు తిరిగిన పిల్లలం
మడి కాపురాలు మరిగిన మల్లెలం
ఆచార వ్యవహారాలు అంటే ఇష్టం
ఆచరించడమే మాకు బహు కష్టం !
మా గురువు గారిని కలుసుకొని
చదువుల విలువలు తెలుసుకొని
ప్రతినిత్యం పోతున్నాం మేం బడికి
వ్రతసత్యం తెలుపు మా ఈ గుడికి!
మా వేద విజ్ఞానాన్ని నేర్చుకున్నాం
మేం వాదవివాదాల ఓర్చుకున్నాం
విజ్ఞానమే మాకు ప్రధానం అన్నాం
అజ్ఞానాన్ని మేం తొలగించుకున్నాం
చేస్తాంమేం మావూరి గుడిప్రదక్షణ
ఇస్తాంలే మా గురువుగారికి దక్షిణ
మాగుడి వార్షికోత్సవాన్ని జరిపిస్తాం
విచ్చేసిన భక్తులందరినిమురిపిస్తాం
గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.