గృహప్రవేశం . (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . ఫోన్ నెంబర్.9491387977.

గృహప్రవేశం . (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . ఫోన్ నెంబర్.9491387977.

గృహప్రవేశం (బాల గేయం)
-----------&&&&&---------------
గృహప్రవేశం స్వగృహప్రవేశం
నిత్య నూతన మీగృహప్రవేశం
మీ బంధువులకు మిత్రులకు
శుభస్య శ్రీఘ్ర ఆహ్వానప్రవేశం !

తిథి వార నక్షత్ర స్థితిగతులను
అతిథి ఆశీర్వాద పరిస్థితులను
గ్రహించి అయ్యవారు నిర్ణయం
సంగ్రహించినదే ఈ గృహప్రవేశం !

నూతన వస్త్రాలను ధరించి
సనాతన ఆచారాల వరించి
జరుగుతున్న ఈ గృహప్రవేశం
తెరమరుగు కానీ సన్నివేశం !

బిలబిలమంటూ బంధువులొస్తారు
భేషైన బహుమతులు ఎన్నోఇస్తారు
చేతిలో చేతినివేసి పరామర్శిస్తారు
చేతికి పూల బొకేలను అందిస్తారు !

గృహప్రవేశం స్వగృహ ప్రవేశం
మీ నిత్యనూతన గృహప్రవేశం
అద్భుతము అద్వితీయము
అది అందరికీ ఆనందదాయకం!

అతిథులకు చెప్పారు సుస్వాగతం
బంధువులకిచ్చారు ఘన స్వాగతం
ఇచ్చారు విందుభోజనాల ఆతిథ్యం
అంతామెచ్చి నచ్చిన ఈ నేపద్యం !

లడ్డు మిఠాయి మాబాగా పెంచారు
బూరెలు గారెలు కూడా వడ్డించారు
షడ్రుచుల రుచిని చవిచూపించారు
శుభస్య శీఘ్రం కార్యం జరిపించారు

కానుకలిచ్చి పంపించారు మీరు
కనులకు తెరమరుగు ఇక కాలేరు
కలకాలం క్షేమంగా మీరు ఉండాలి 
నిక్షేపంగా మీ జీవితం ఇక పండాలి


మీ ఆతిథ్యానికి మేం స్పందిస్తూ
మా ఆశీర్వచనాలను అందిస్తూ
ఎల్లకాలం సుఖంగా ఉండాలని
నోరారా పలుకుతున్నాం శుభమస్తు

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments