జిల్లెళ్ళమూడి అమ్మ మల్లెలం !
--------------₹₹₹₹₹-------------------
మేము డిల్లెం బొల్లెం మగ పిల్లలం
మా జిల్లెళ్ళమూడి అమ్మ మల్లెలం
కలసిమెలసి మేము ఆడుకుంటం
అలసిసొలసినా పాటపాడుకుంటం
మేం జిల్లెల్ల అమ్మ భక్తులం
మా పాపవినాశ విముక్తులం
నిత్యం చేసుకుంటాం దర్శనం
మా సత్యమార్గమే నిదర్శనం !
వచ్చిపోయేటి పరమభక్తులకు
పూజా పునస్కార అనురక్తులకు
పూజా సామాగ్రిని సమకూరుస్తాం
పూజా కార్యాలకుమేం సహకరిస్తాం
జిల్లెళ్ళమూడి అమ్మ అంటేనే ప్రేమ
మా కోసం పడింది ఆమెఎంతో శ్రమ
ఇప్పటికీ తాను పడుతూనే ఉంది
అష్ట కష్టాలతో తాను ఇక ఇబ్బంది
జిల్లెళ్ళమూడి అమ్మ శివ భక్తురాలు
దేవుళ్ళ కీర్తించు కవియిత్రిరాలు
శిలల పైన శిల్పాలను చెక్కించింది
ఆ శిల్పాలకు భక్తులచే మొక్కించింది
బడిలో గురువులను కొలిచినట్లు
గుడిలోన దేవుళ్ళను తలచినట్లు
జిల్లెలగూడ అమ్మను ప్రేమిస్తారు
ఊళ్లళ్ళ అమ్మలంతా పూజిస్తారు
పిల్లలమైన మేమంతా దినమంతా
ప్రేమతో చేరుతాం ఆ అమ్మ చెంత
కరుణించి ఆశీర్వాదం అందిస్తుంది
కరుణా సాగరంలోన బంధిస్తుంది!
హలో హలో మా బాల మిత్రులారా
చలో చలో మా బాల్య మిత్రులారా
జిల్లెలగూడ అమ్మను పూజిద్దాం రండి
మల్లెల వాడగా ఊరును మార్చుకుందాం లెండి !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.