పెళ్లి బాజాల పిల్లలం (బాల గేయం)
-----------------&&&&&----------------
పెళ్లి బాజాలు కొట్టేటి చిన్న పిల్లలం
తొల్లి కాజాలు కుట్టేటిపిన్న మల్లెలం
పెళ్లి ముహూర్తాలు పెట్టేటి. వారలం
మేంవేదమంత్రాలు చదివేటిపోరలం
వధువరుల జాతకాలు చూస్తాం
చదువరుల సంతకాలు చేస్తాం
ఇరువైపుల వారిని మేం ఒప్పిస్తాం
ఖరారుచేసి కళ్యాణం జరిపిస్తాం !
కళ్యాణం కమనీయం అనిపిస్తాం
కళ్యాణం వైభోగంగా జరిపిస్తాం
విచ్చేసినవారిని మేం మురిపిస్తాం
తెచ్చేసినపూల వర్షం కురిపిస్తాం
కళ్యాణ మండపాన్ని వేగ నిర్మిస్తాం
కన్నుల పండుగ శోభను కల్పిస్తాం
బజా భజంత్రీలను మేంపిలిపిస్తాం
వేద మంత్ర జంత్రీలను చదివిస్తాం!
అచ్చేసిన శుభలేఖలను పంచుతాం
విచ్చేసినవారిన ఆనందంలో ముంచుతాం
కట్నకానుకల వివాదాన్ని తెంచుతాం
ఆనందాల హరివిల్లును భువికి దించుతాం!
మంగళ సూత్రాలను కన్నులకు అద్దుకుంటాం
అమంగళం తొలగిపోయి మేం ముద్దుగుంటం
వచ్చి పోయే వారిని పలకరిస్తూ ఉంటాం
నచ్చిన అత్తరు పన్నీరులను చిలకరిస్తూ ఉంటాం!
విందు భోజనాలను వడ్డిస్తాం దినమంతా
బంధుమిత్రులను మెప్పిస్తాం మేమంతా
పరిణయ దుస్తుల ఎన్నిక చేస్తాం మేమంతా
పరిచయ దోస్తుల మన్నిక చూస్తాం కొంత !
త్రాగేటి పానీయాలను అందిస్తాం
మ్రోగేటి బాజాల లయగని ఆనందిస్తాం
వధూవరులపై అక్షింతలను చల్లుతాం
ఆశీర్వదించి తిరిగి మేం మా ఇంటికి మల్లుతాం
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.