సూర్యతేజ పిల్లలం. (బాల గేయం)
-------------₹₹₹₹₹----------------------
మేము సూర్య తేజ పిల్లలం
కాము కాంతిహీన మల్లెలం
వెన్నెల వెలుగుల వారలం
కలువల కన్నుల .పోరలం !
శ్రీ సూర్య భగవానుని పూజిస్తాం
మా సూర్యనమస్కారాలతో ధ్యానిస్తాం
ఆ అరుణా ఆదిత్య మూర్తిని చేరుకుంటాం
కరుణా కటాక్షాన్ని కోరుకుంటాం !
పాలపుంత దారిలో పయనిస్తాం
వెన్నెల పల్లకిలో మేము శయనిస్తాం
మా వెన్నెలరాజును ఆహ్వానిస్తాం
మేం కలువ పూలతో సన్మానిస్తాం !
కిరణ కరుణమూర్తి మా దేవుడు
మా ఆశల ఆశయాల శ్రీరాముడు
వేకువనే లోకములను లేపుతాడు
తాను మోక్షానికి దారి చూపుతాడు!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.