ముందుకే అడుగేస్తాం(బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ముందుకే అడుగేస్తాం(బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ముందుకే అడుగేస్తాం!(గేయం)
--------------&&&&&----------------
ఆకలి కేకల చిన్న పిల్లలం మేం
అసలే నూకలు లేని మల్లెలం
కూలినాలికి మేం వెళ్ళుతుంటం.
ఆకలి వేసి ఇక మేం గొళ్ళుమంటం!

ఇది ఆ దైవం వ్రాసిన మాతలరాత
మది భరించలేనిది ఈ గుండెకోత
పొట్ట కూటికై మేం పట్నం వచ్చినం
పనిపాటకై మేస్త్రిలకు అడ్రసిచ్చినం

పని దొరికిననాడే మాకు పండుగ
లేనిచో నీళ్ళేతాగుతాం మేంనిండుగ
అందరిలా చదువుకోవాలని ఉంది
ధనం లేకనే మాకు కల్గింది ఇబ్బంది

కాంట్రాక్టర్ల చేతికింద పనిచేస్తున్నం
ట్రాక్టర్లనడుపు శిక్షణకైయత్నిస్తున్నం
తిండి కోసం  తిప్పలు పడుతున్నం
కండలు కరిగించి ఖంగుతింటున్నం!

మేస్త్రి అవతారం కూడా ఎత్తినాం
మస్తు గృహాలను మేము కట్టినాం
దొరికిన ప్రతిపని గూడామేం చేస్తాం
ఆనందంగా ఇక మేము జీవిస్తాం !

ప్రతిపనిని మనసుపెట్టి మేం చేస్తం
ప్రతినబట్టి దీక్షగట్టి పని పూర్తిచేస్తం
ఆకలికేకల అంతంమేం ఇకచూస్తం
అవకాశంఅందుకొనిముందడుగేస్తం

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments