కవిత్వం రాసే పిల్లలం .(బాధ గేయం) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

కవిత్వం రాసే పిల్లలం .(బాధ గేయం) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

కవిత్వం వ్రాసే పిల్లలం(గేయం)
-------------&&&&&&----------------
తిరుపతి వెంకట కవుల పిల్లలం
పరపతి కలిగిన కవల మల్లెలం
కవితలు కథలు మేం వ్రాస్తుంటం
కవన సాహిత్యసేవనే చేస్తుంటం!

నాటికలు నాటకాలను వ్రాస్తుంటాం
నటించి ప్రోగ్రాములమేం ఇస్తుంటం
గ్రంధంగా వాటిని అచ్చు వేస్తుంటాం గ్రంథాలయాలకు ఇకపంపిస్తుంటాం

పేరున్న కవులను మేం కలుస్తాం
పేరడీ కవిత్వ రచనల చూపిస్తాం
వారి సూచనలను మేం పాటిస్తాం
కోరిమేం మాతప్పొప్పుల సవరిస్తాం

పూర్వకవుల రచనల పరిశీలిస్తాం
పరిశోధించి పి.హెచ్.డి.ని సాధిస్తాం కవిగా ఇక గుర్తింపు వస్తుంది మాకు
కవితలెన్నో రాస్తాం ఇక రేపు మాపు

పలు రచనలు మేము చేస్తుంటం
పత్రికా ఎడిటర్లకు పంపిస్తుంటం
అచ్చయితే చూసి ఆనందిస్తుంటం
తిరిగొస్తే వాటిని త్రిప్పి వ్రాస్తుంటం !

తిరుపతి వెంకట కవుల ఆశీర్వాదం వల్ల
పరపతిగల కవులైపోయాం ఇక మేమెల్ల
ఆ మహనీయుల స్పూర్తియే మా నిలువెల్లా
సంగీతం సాహిత్యంమే మా కొలువులైనాయి మల్లా!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments