శాంత మూర్తుల పిల్లలం . (బాలగేయం). మాల మిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

శాంత మూర్తుల పిల్లలం . (బాలగేయం). మాల మిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

శాంతమూర్తుల పిల్లలం !(బాలగేయం)----గుర్రాల.
----------&&&&&------------
మేం జాగీర్దారు పిల్లలం
మా అవ్వల్దారు మల్లెలం
దర్జాధర్పం మేంఉన్నోళ్ళం
ఆవర్జా అస్సలు లేనోళ్ళం !

అల్లారుముద్దుగా పెరిగినాం
నల్లేరు ముద్దతిన మరిగినాం
సందు గొందుల్లోమేం తిరిగినాం
పందుల్లా బురదల్లో ఒరిగినాం  !

సిగ్గు ఎగ్గును కష్టంగా వదిలినాం
మగ్గుపెగ్గుకు ఇష్టంగా కదలినాం
అయినా చిక్కలేదు మాకు మందు
ఏమైనా చుక్కతోనే ఇక మావిందు !

మస్తుదోస్తులు మాకు జతయైనారు వస్తూపోతూ వారు వేంచేస్తున్నారు
మా జేబులు ఇక ఖాళీచేస్తున్నారు
మాపైవారేరుబాబు చూపిస్తున్నారు

అమ్మా నాన్నల మాటను వినక
మా పెద్దాయన మాటను కనక
రెంటికి రేవడియై మేం చెడితిమి
ఒంటికి జ్వరం మొచ్చి పడితిమి!

దిక్కులేని పక్షులుగా మేం మిగిలాం
గూడు లేక మేం గుడిలోకి కదిలాం
దేవుని ప్రసాదం మాకు దిక్కైయింది
ముక్తినొంది మా బతుకే లక్కైయింది

మా పాపం ప్రక్షాళనమై పునీతులమైనాం
మాశాపం మాయమై పుణ్యాత్ములు గా మేం మిగిలాం
అప్పుడు మమ్ముల ఆదరించారు అంతా
ఇప్పుడు లేదులే మాకు ఎలాంటి చింతా !

ఊర్ల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments