ధ్యానం-దాని ఆవశ్యకత. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ధ్యానం-దాని ఆవశ్యకత. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ధ్యానం-దాని ఆవశ్యకత !
---------₹₹₹₹₹₹-------------- 
ఈ విశ్వంలో ఎన్నో జీవులు స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతముగా తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. నీటిలో నుండి ఒడ్డున పడ్డ చేపలు ఎలా గిలగిల కొట్టుకుంటాయో అలానే పరమాత్మను చేరుకోలేని ఆత్మ కూడా అదేవిధంగా కొట్టుకుంటుంది. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయములు మున్నగు త్రిపుటీ భావనలు లుప్త మైనప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. దానికి వారధి ధ్యానమే.
              మనందరికీ కంటికి కనబడే మన శరీరం గురించి, అనేక ఆలోచనతో నిండి ఉన్న మనస్సు గురించి మనకు బాగా తెలుసు. కానీ కానీ ఈరెంటిని ప్రభావితం చేసే మన కంటికి కనిపించని" ఆత్మ"గురించి మాత్రం అస్సలు తెలియదు. అందుకే ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నలకు అనుభవ పూర్వకమైన సమాధానాలు మనకు ధ్యాన సాధన ద్వారానే తెలుస్తాయి.
          ధ్యానం చేయడం మొదలుపెడితే మనకు మన శరీరానికి మనసుకు ఆధారమైన టువంటి మన ఆత్మ"దైవ శక్తి లోని ఒకానొక అభిన్నమైన భాగం.అనీ,"మనం సాక్షాత్త్ దైవాలం అని తెలుస్తుంది. ఇలా సృష్టిలోని అనేక అనేక సత్యాలు మన అనుభవంలోకి వచ్చి అసలు జీవితం ఎంత విలువైనదో మనకు అర్థం కావాలంటే శ్వాస విద్యను ధ్యానం ద్వారా నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉండాలి.
ధ్యానం ప్రయోజనములు.........
-------------------------------
1.ధ్యానం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
2. ఆలోచనా తరంగాలు ఆగిపోతాయి.
3. చేతన విస్తరిస్తుంది.
4. అన్ని శారీరక వ్యవస్థలు అలసటను మరిచి పోతాయి
5. మళ్లీ రెట్టింపు సామర్థ్యంతో పని చేయగలుగుతాయి.
6. శారీరక, మానసిక బాధనుండి విముక్తి లభిస్తోంది.
7. తదుపరి  స్పృహలోకి వచ్చినప్పుడు చాలా అందమైన, అపురూపమైన విశ్రాంతిని అనుభవించమనే విషయం ఎరుకల లోనికి వస్తుంది.
8. ఎంతటి గాఢమైన నిద్ర కూడా "ధ్యానాన్ని" పోలిన విశ్రాంతిని ఇవ్వలేదని నిరూపితమైనది.
9. ధ్యాన సాధనలో చిత్త వృత్తులు నిరోధింప పడతాయి.
10. బాహ్య విషయాల సహాయం లేకుండా, వేనిపైన ఆధారపడకుండా సాధన చేయగలిగేది ధ్యానం ఒక్కటే.
11. ధ్యానం మనల్ని మనం తేల్చుకోవడానికి సహకరిస్తుంది.
12. మన ఆత్మ జ్యోతి మనలోని ప్రతి చిన్న చీకటి ఈ కోణాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది ధ్యానం.
13. ఆత్మకు అందమైన రంగుల్ని అద్దుతుంది. సుగంధ పరిమళాలతో నింపివేసి మహదానందం వైపు ద్వారాల్ని తెరుస్తుంది ధ్యానం.
14.🪂 ప్రతి మనిషి మనసులో అశాంతి, అత్యాశ, అభద్రత, అలజడి, ఆవేశం, ఆందోళన, ఆత్మహత్య ప్రేరణ, ఆత్మన్యూనత తదితర అ వ్యతిరేక ధోరణులు దాగి ఉండి అతని ప్రవర్తన, ఆరోగ్యాల పైన దుష్ప్రభావాలుచూపిస్తున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో తప్పనిసరి వేగం మానవుని మస్తిష్కాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తున్నది. తత్కారణంగా ఎన్నో వ్యాధులు, బాధలు, వ్యాకులతలకు మానవుడు లోనవుతున్నారనేది సత్యం. శాంతము లేక సౌఖ్యం లేదని ఏనాడో ప్రసిద్ధ అ వాగ్గేయకారుడు త్యాగయ్య తెలిపారు.
       కాన ధ్యానం వీటినన్నింటిని దూరం చేస్తుంది. ధ్యానం అనేది నిద్ర కాదు. సమాధి స్థితి మరణం కాదు. అహంబ్రహ్మాస్మి అనే అపరోక్ష భావన చేత బ్రహ్మానంద స్థితి మనకు లభిస్తుంది.
       మానవుల అన్ని కష్టాలకు, సమస్యలకు ఈ ఏకైక పరిష్కార మార్గం ధ్యానం ఒక్కటే. ధ్యానం వలన చేకూరే మానసిక ప్రశాంతత మరే విధంగానూ సాధ్యం కాదని మానసిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments