జలం మన బలం (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్ర . సెల్ నెంబర్ 9491387977.

జలం మన బలం (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్ర . సెల్ నెంబర్ 9491387977.

జలం మన బలం (కవిత)
-----------&&&&&------------
జలం జలం జలం ఈ భూమిలోని జలం
బలం బలం బలం మన గళానికే బలం
జీవుల సంజీవినయై దాహార్తిని పూర్తిచేసే జలం
మానవుల అవసరాల పూర్తిగాను తీర్చేసే జలం !

జలమన్నది ఉంటేనే మనకు కలుగు బలం
ఆజలమే లేకుంటే మూగబోవు మన గళం
ప్రకృతి సృష్టికి ఈ సుజలమే ఆధారం
సంస్కృతి ప్రతిష్టకు మూలం జల ద్వారం!

మానవ రోగ నివారిణి ఈభూమిలోని జలం
ఆయురారోగ్యాలను అందించే సజీవ సుజలజలం
బిందు బిందువుగా ఏకమై చేరుకొనును సింధువు
మన పాలిటి జీవన సంజీవిని అని ఒప్పు కొందువు !

చెట్లుంటేనేగదా శూన్యములో గాలొచ్చేది
ఆ గాలికి మేఘం విచ్ఛిన్నమై వర్షాన్నిచ్చేది
ఆ వర్షం వరదైపారుతు మన పొలానికి వచ్చేది
మదికి హర్షం కలిగేలా బంగారు సిరులిచ్చేది !

దివి నుండి భువికి దిగివచ్చిన ఈ జలం
మానవ మనుగడకు ఇచ్చునులే బలం
ఈ జలమే లేకుంటే బతుకంతా ఇక ఆగం ఆగం
జలముంటేనే మన జన జీవనయోగం సంయోగం

కురిసే వర్షం నీటిని బొట్టు బొట్టుగా ఒడిసి పట్టు
ఇంటి ముందు ఇంకుడు గుంతల తొవ్విపెట్టు
ఇల చెట్టూ చేమను పెంచేటట్టు పట్టు నీవిక పట్టు
జలరాశిని పెంచి జీవరాశుల ప్రాణాలను నిలబెట్టు !

0/Post a Comment/Comments