లింగారాధనే సర్వ శ్రేష్టం. (పౌరాణిక వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

లింగారాధనే సర్వ శ్రేష్టం. (పౌరాణిక వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

లింగారాధనే సర్వ శ్రేష్టం!
---------&&&&--------------
శివలింగారాధనే సర్వశ్రేష్టం అని మనందరకు తెలుసు. కానీ శివ లింగాలు 6 రకాలుగా ఉన్నా యి. అవి ఇవి.
1). గ్రామములోని శివలింగం.
2). గ్రామం బయట ఉన్న శివలింగం.
3) అడవిలోని శివలింగం.
4) పర్వతంపై గల శివలింగం.
5) సన్యాసుల ఆశ్రమంలోని శివలింగం.
6). సిద్ధ గురువుల, మహర్షుల ఆశ్రమములోని శివలింగం.
             1. గ్రామాత్ బహిస్థితం లింగం గ్రామాఛ్ఛత గుణం స్మృతం.
గ్రామములోని శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలం గ్రామం బయట ఉన్న శివలింగాన్ని పూజిస్తే ఒక 100రెట్ల అధిక ఫలం కలుగుతుంది.
2.బాహ్యాఛ్ఛత గుణం పుణ్యం అరణ్యేఛ ప్రపూజనే.
         గ్రామం బయట ఉన్న శివ లింగాన్ని పూజిస్తే కలిగే ఫలితం కంటే అరణ్యంలోని శివలింగమును పూజిస్తే 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది.
3. వన్యాఛ్యత గుణం పుణ్యం లింగ వై పార్వతి స్థితం.
అరణ్యములోని శివలింగాన్ని పూజిస్తే కలిగే బలం కంటే 100 రెట్ల అధిక ఫలం, పర్వతం పై గల శివలింగాన్ని పూజిస్తే కలుగుతుంది
4.పర్వతాఛ్ఛత గుణం పుణ్యం తపోవన సమాశ్రితం.
           పర్వతంపై కల లింగాన్ని పూజిస్తే కలిగే ఫలం కంటే 100 రెట్ల అధిక ఫలం నిజమైన అసలైన సిసలైన సన్యాసుల ఆశ్రమాలలోని శివలింగాన్ని పూజిస్తే కలుగుతుంది
5.కాశ్యాం తు స్థాపితం లింగం పూజితం స్యాదనంతకం.
          సన్యాసుల ఆశ్రమాలలో ని శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలితం కంటే 100రెట్ల అధిక ఫలం సిద్ధ గురువులు ఆశ్రమాలలో ని శివ లింగాన్ని పూజిస్తే కలుగుతుంది.
సిద్ధ గురువుల ఆశ్రమాలలో ని, పీఠములలోని లింగార్చన ఎంతటి మహిమాన్వితమో శాస్త్రము ఈ విధముగా తెలిపినది.
గృహేత్వేక గుణం ప్రోక్తం,నదీతీరే సహస్రకం
దేవతాయాతనే లక్ష్యం దశ లక్షంహరేర్గృహే.
శివాలయే కోటిగుణం స్వయంభూ సన్నిధౌ పునః!
అనంతం పూజనం శంభో ఋతంవచ్మిద్విజోత్తమ!!
ఇంటిలో చేసే లింగార్చన కంటే
నదీ తీరములో చేసే లింగార్చన 1000రెట్లు అధిక ఫలాన్ని, గుళ్ళో100000రెట్ల అధిక ఫలాన్ని,
శివాలయములో కోటిరెట్ల పలన్ని,
స్వయంభూ శివాలయములో 10కోట్ల రెట్ల అధిక ఫలాన్ని, సిద్ధగురువుల, మహర్షుల సన్నిధిలోని శివలింగాలను పూజిస్తే కోటి కోట్ల రెట్లు అధిక ఫలాన్ని మనం పొందవచ్చు.
శాస్త్రము యొక్క ఆ దేశాన్ని బట్టి సిద్ధ గురువుల, మహర్షుల సన్నిధిలోని శివలింగారాధన సర్వ శ్రేష్టమైనదనీ తెలియుచున్నది.
       కావున సిద్ధగురువుల సన్నిధిలోని శివలింగాన్ని మనం ఆరాధిధ్ధాం. మన జన్మ ధన్యమై అంతా హాయిగా జీవిద్దాం.
శివోహం!!! శివోహం!!! శివోహం!!!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments