రచన: మోటూరి నారాయణరావు
ప్రాంతం: హైదరాబాద్
చరవాణి : 9346250304
ప్రాంతం: హైదరాబాద్
చరవాణి : 9346250304
శిశిరమైన ప్రతిసారీ
వసంతమై విరబూస్తుంది
గ్రీష్మ తాపాలను
హృదిలోపల దాచేస్తూ
శరశ్చంద్రికలను ప్రసరిస్తుంది
గర్భగుడిలో పురుడోసుకున్న
ప్రాణకణాలే రాక్షసులుగా మారి
బలిదీసుకుంటున్న ఘటనలు
ఆమెను వీడటంలేదెందుకు
అంతరిక్షంలో రాకెట్ లా
గగనతలంలో..విహాంగంలా
మేఘాలలో మిస్సైల్స్ లా
మహిళలు దూసుకుపోతున్నా
కారు మబ్బులా నల్లటిపొరలు
ఆమెను వీడటంలేదెందుకు
పట్టపగలే నట్టనడిరోడ్డుపై
ఒంటరిగా పయనిస్తున్న
ఆమె వీపులపై కామాంధుల
మోహపు,నీచపు చూపులు
ఆమెను వీడటంలేదెందుకు
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా
స్వేశ్ఛగా సంచరించిన నాడే
దేశానికి స్వాతంత్య్రమన్నారు
అడుగడుగునా అణువణువునా
కీచకపర్వాలకు
తెరలేపుతున్న
మృగాళ్ల నికృష్టచేష్టలు
ఆమెను వీడటంలేదెందుకు
క్షణం తీరిక లేని పని ఒత్తిడి
నిత్యం బండెడుచాకిరి
అమ్మగా భార్యగా
అక్కగా చెల్లిగా
వదినగా మరదలిగా
ఎన్ని పాత్రలు పోషిస్తున్నా
ఇంకా వంటపాత్రల ముందు
మౌనపోరాటం
పురుషాధిక్య సమాజంలో
నిరంతర యుద్దం
ఆమెను వీడటంలేదెందుకు
అందుకే
ఆమె
ముంచుకొస్తున్న
కన్నీళ్లను మింగేసి
కలకత్తా కాళీ అవతారమెత్తాలి
మీద పడుతున్న
బాధలను విడిచేసి
భద్రకాళిలా మారాలి
శత్రుమూకలను చండాడే
రుద్రమదేవిలు రావాలి
కీచకులను హతమార్చే
శక్తిస్వరూపిణి కావాలి
స్త్రీ శక్తి కి సాహితీ వందనం
మీ
మోటూరి నారాయణరావు
ప్రధాన కార్యదర్శి
తెలుగు వెలుగు సాహిత్య వేదిక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ
మోటూరి నారాయణరావు
ప్రధాన కార్యదర్శి
తెలుగు వెలుగు సాహిత్య వేదిక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Post a Comment