వరల్డ్ రికార్డ్స్ నమోదు కవి సమ్మేళనం కొప్పుల ప్రసాద్...

వరల్డ్ రికార్డ్స్ నమోదు కవి సమ్మేళనం కొప్పుల ప్రసాద్...

 

వరల్డ్ రికార్డ్స్ నమోదు కవి సమ్మేళనంలో... కొప్పుల ప్రసాద్

మన నంద్యాల కు చెందిన కొప్పుల ప్రసాద్ గారు. I.S.O. గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అయిన  శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లో బుద్దాల కన్వెన్షన్ హాల్లో ఈనెల 12, 13, తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు కవితోత్సవంలో భాగంగా 24 గంటల 24 నిమిషాల 24 సెకన్ల పాటు జరిగిన కవి సమ్మేళనం వరల్డ్ రికార్డ్ గా నమోదు  జరిగింది, అందులో పాల్గొని కవిత గానము చేసినందుకు గాను, మన సంస్కృతి - సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్నందుకు భారత్ టాలెంట్ బుక్ రికార్డ్స్ ఇంటర్ నేషనల్ మార్వెల్ బుక్ రికార్డ్స్ మరియు తానా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కొప్పుల ప్రసాద్ ను శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, పూలమాల తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డా. ప్రతాప్ కత్తిమండ  గారు, జాతీయ  కన్వీనర్ కొల్లి రామవతి గారు పాల్గొన్నారు. కొప్పుల ప్రసాద్ ను నంద్యాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. నలంద కళాశాలల యాజమాన్యం రామ సుబ్బయ్య గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఉమా మహేశ్వర్ రెడ్డి గారు, ఏ .బి. రెడ్డి గారు, కళాశాలకు చెందిన లెక్చరర్స్, బాలాజీ విద్యా మందిర్ కరస్పాండెంట్ వెంకటస్వామి గారు, అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ గారు, కవులు అన్నెం శ్రీనివాసరెడ్డి, నరేంద్ర, మహబూబ్ బాషా, అభినందించడం జరిగింది.

0/Post a Comment/Comments