ఓ వనిత...

ఓ వనిత...ఏమని చెప్పాలి ఓ వనిత
మీ త్యాగం
మీ సమర్పణ
మీ వాత్సల్యం
మాపై చూపే 
మీ క్షమా గుణం...
పుడమి కున్న భారమంతా
ప్రకృతి లోని అందమంతా
మీ లోనే ఉన్నా...
మేము చిన్నచూపు చూసిన
అయ్యో ! ఆడపిల్లా అని మాట్లాడిన
అమ్మలా లాలించావు
భార్యగా ప్రేమ పంచావు
సోదరిగా మమతను పెంచావు
నిన్ను నిందించిన 
దేవతగా
క్షమాగుణం తో
మమ్ము పోషించేవు...
ఏమని చెప్పాలి
ఏమని రాయాలి
మాటలకు అందని
పదాలు తెలియని
భావం నీవు
బాధ్యత నీవు
సృష్టిని నడిపించే మూలమే 
నీవు కాదా...
....శ్రీపాల్....
8978894808

 


0/Post a Comment/Comments