.వినియోగదారుల హక్కులు
శీర్షిక. జాగారణ
వినియోగదారుడు
నీకు సేవకుడు కాదు
నీవు అతనికి సేవకుడు గా
భావించు
నీ అభివృద్ధికి అతను తోడ్పాటును అందిస్తున్నాడు
అతనే నీవృద్ధికి మూలం
అన్న గాంధీ మాటలు
నిత్యాసత్యాలుగా ధ్వనించాలి
నేడు అడుగు అడుగున మోసం
ఒన్ లైన్ దాగాలు
ఆఫ్ లైన్ కుతంత్రాలు
ఎంతమందికి తెలుసు
వినియోగదారుల చట్టాలు
ఎంతమంది తీసుకుంటున్నారు రశీదులు
నాణ్యత ప్రమాణాలు
విలువ
ఎం.ఆర్.పి రేట్లు
జి. ఎస్.టి లు
ఐ.ఎస్.ఐ గుర్తులు
చిన్న అక్షరాలు మార్చి
కల్తీ వస్తువులు అమ్మడం
ఆహారం, పాలు, నీళ్లు
కల్తీ కానిది ఏది లేదు
అమ్మ పాలు ఆవు పాలు
ప్రాణాలు నిలిపే ఆహారం
కల్తీ తీవ్రవాదం కన్న
ఎక్కువ ముప్పు
వినియోగదారుల ఫోరం లు
వినియోదారుల కోర్టులు ఉన్నాయి
అవగాహన లేమి వద్దు
అవగాహన ముద్దు
పాఠశాల స్థాయి నుంచే
అవగాహన పెంచాలి
టీ.వి సెరియళ్లు కాదు
సమాజానికి హితం అయిన
చట్టాలు ప్రసారం ప్రచారం
బాధ్యతగా చెయ్యాలి
అవగాహన లేమి తొలుగాలి
విజ్ఞత ప్రదర్శించాలి
న్యాయ సూత్రాలు
సాహజ ధర్మాన్ని
పాటించాలి
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామరెడ్డి
9440408080