శీర్షిక: అంతేగా... అంతేగా. పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: అంతేగా... అంతేగా. పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: అంతేగా...అంతేగా

నాయకుడంతే
నరంలేని నాలుకతో మటలెన్నయినా జనంపైకొదిలేస్తాడు

జనంకూడంతేగా
గొర్రె కసాయివాన్నే నమ్మినట్లు
మాటలకుబ్బి తబ్బిబ్బయిపోతరు

ఏసీ గదుల్లో కదలకుండా నిండుకుండలాగా నిమ్మలంగున్నోడు
ఎన్నికలొస్తున్నాయంటే
ఎండల్లో జనాలనుంచి గాలిమోటర్ల గాలిమాటల్తో
నమ్మిస్తుంటడు

మరిచిపోయిన జనాల్నందర్ని
కూడదీసుకునేందుకు
మటన్ బిర్యానిలిచ్చి మత్తులదించుతడు
లేనిపోనివన్నిజెప్పి మాయజేసేస్తడు

నిరుద్యోగులైతే కోచింగ్ సెంటర్లో 
ఆశలదీపం వెలిగిస్తరు
జరిగినదంతా మరచిపోతరు
జైగొట్టి పట్టం గడుతరు
నిరుద్యోగభృతినిస్తే ఎగిరిగంతులేస్తున్నరు

ఉద్యమంలో ఊపిరొదిలిన పాపానికి నేటికింకా శిక్షననుభవిస్తునే వున్నం
లాఠీదెబ్బలుతిని రాజ్యం తెస్తే
సింహాసానాలెక్కి 
తమబిడ్డల సంక్షేమానికి పెద్దపీఠలేస్తున్నరు

సంక్షేమం పేరుతో
తాయిళాల జాతర సురువుజేస్తరు
మేమున్నదే బీదలనుద్దరించేందుకని
మనసుల నాటవెడుతరు

ప్రతిపక్షాలైతే పక్షవాతమొచ్చినట్లు
ఏంజెప్పాల్నో అర్థంకాక
పాపం దిక్కుతోచని దీనులైతరు
సమాయమాసన్నమైనప్పుడు
బొక్కబోర్లపడుతున్నరు

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments