పుట్లర్ (పుతిన్+హిట్లర్) ---- డా.రామక కృష్ణమూర్తి

పుట్లర్ (పుతిన్+హిట్లర్) ---- డా.రామక కృష్ణమూర్తి

 


పుట్లర్ (పుతిన్+హిట్లర్)
----- డా.రామక కృష్ణమూర్తి
       బోయినపల్లి, సికింద్రాబాద్.ఆధిపత్యం,అహంభావం 
జతకట్టి హుంకరించిన వేళ
యుద్ధం అనివార్యమై నిలిచింది.
సంపదల మీద ఆశ,
ఆయుధాల మీద భరోసా,
బలమున్న వాడిదే మాట,
శాంతి ప్రవచనాలు గాలికి,
యుద్ధట్యాంకులు ముందు ముందుకి,
బాంబులు మోత మోగిస్తుంటే,
నగరాలు విధ్వంసానికి సజీవసాక్ష్యాలై,
చరిత్రకు చెరిగిపోని పుటలై
కాలగర్భంలో కలుస్తున్నాయి.
సామాన్యప్రజల రక్తతర్పణాలతో,
సైనికుల ప్రాణదానాలతో,
సజలమైన నయనాల 
ఆప్తుల ఆలింగనాల వీడ్కోళ్ళు.
శాంతి చర్చల నాటకాలు
రక్తికట్టిస్తూ,
వీటోలతో వెక్కిరిస్తూ,
అణ్వస్త్రాలతో బెదిరిస్తూ,
సామ్రాజ్యవాద,నియంతృత్వ పోకడల రంగులు మారుస్తూ,
ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న
యుద్ధోన్మాదం 
యుగాంతానికి సంకేతాలిస్తున్నది.

2/Post a Comment/Comments

Unknown said…
Superb sir 👌 👏 👍 🙏🙏🙏
habybkabler said…
Betway: Review, Promotions, and Bonuses - DrmCAD
Welcome to the latest in the Betway 부산광역 출장안마 family, which are 청주 출장마사지 part of the Betway family. As part of the partnership, we'll make it more  Rating: 광양 출장안마 4.2 · ‎Review 제주 출장샵 by drmcd 인천광역 출장샵