'శత తేనియ కవి పురస్కారం' గద్వాల సోమన్న కు ప్రదానం-అభినందనలతో ప్రవాహిని💐💐

'శత తేనియ కవి పురస్కారం' గద్వాల సోమన్న కు ప్రదానం-అభినందనలతో ప్రవాహిని💐💐

'శత తేనియ కవి పురస్కారం' గద్వాల సోమన్న కు ప్రదానం
---------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హిస్సార మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న కు 'శత తేనియ కవి' పురస్కారం వరించింది. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న వీరి ఖాతాలో మరో పురస్కారం జమ కావడం విశేషం.విజయ ప్రసాద్ నలుమాచు రూపొందించిన తేనియలు తెలుగు సాహిత్య లఘు కవితా ప్రక్రియలో అనతికాలంలోనే  శతాధిక కవితలు రాయడమే కాకుండా తెలుగు సాహిత్యంలో వీరి అనన్య సామాన్య కృషికి గాను 'తేనియలు సాహితీ వేదిక',తెలంగాణ రాష్ట్రం వారు అంతర్జాలం(జూమ్) వేదికగా 'శత తేనియ కవి' పురస్కారం ప్రదానం చేశారు.పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను 'తేనియలు సాహితీ వేదిక' కార్యవర్గం,తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు మరియు పురప్రముఖులు అభినందించారు.

0/Post a Comment/Comments