మహిళలు మహారాణులు ... సుధారాణి కృష్ణంరాజు

మహిళలు మహారాణులు ... సుధారాణి కృష్ణంరాజు

మహిళలు మహారాణులు

మహిళలేనిది మనుగడ లేదు
అక్కగా చెల్లిగా భార్యగా
తల్లి గా అనురాగం పంచే
అమృత‌ మూర్తి మహిళ
అనుకున్నది సాధిస్తుంది
నూతనత్వాన్ని శోధిస్తుంది
సహనము లో సీతగా
ఓర్పులో భూమాతగా
అన్నిరంగాలలో అలపెరుగని
స్త్రీ మూర్తి అందుకో వందనం
-------------------------------------
వ్యవసాయం నుండి అంతరిక్షం
వరకు ఏదైనా చేయగలదు
ఎవరినైనా మెప్పించ గలదు
ప్రకృతికి మారుపేరు మహిళ
ప్రకృతి వికటిస్తే భీభత్సం
మహిళ సహనాన్ని పరిక్షిస్తే
ప్రళయమే
----------------------------------
సంధర్భోచితంగా ఆలోచించే
మేధావి వృత్తిలోను రాణించగల
అద్భుత శక్తి మహిళ
ఇన్ని సుగుణాలు ఉన్నా
అడుగడుగున అవరోధాలు
అధిగ మించి అది తూచి
అడుగు వేసే మహిళ
ఎందరో స్త్రీ మూర్తులు‌ 
అందరికీ వందనాలు
--------------------------------------
ఝాన్సీ లక్ష్మి ,రాణి రుద్రమ దేవి
సరోజినీ నాయుడు మొదలైన
మహిళా మణులు పుట్టిన గడ్డ
నాదేశం నా భారత దేశం
---–----------------------------------
ఆశయం సాధించాలంటే
అవయవలోపం అంగవైకల్యం
అవరోధం కాదని కృత్రిమ
కాలుతో నాట్యం చేసి 
నటరాజును మెప్పించిన
మయూరి సుధా‌ చంద్రన్ లు
కావాలి అందరికి స్ఫూర్తి
మయూరిగా అందరి మదిలో
హుందాగా నిలిచి పోయిన
సుధా చంద్రన్ 
వారి బాటలో పయనించి
మన ఆశయాలను సాధించుటే
ఘనకీర్తి
సాధించి తీరాలి మహిళలు
మహారాణులే అని నిరూపించాలి

....సుధారాణి కృష్ణంరాజు 
ఊరు:  బడంగ్ పేట
------------------------------------

0/Post a Comment/Comments