శీర్షిక: కవి-కవిత్వం
కవనం అది నిత్యనూతం
లోకానికంతా నవచైతన్యం
లోకంపోకడనంతా
లౌక్యంతో ముందుంచేది
పరిస్థితేదైనా పరిశీలనాత్మకంగా పదునైన పదజాలంతో ధైర్యంగా ఎదలో నాటే మూడో నేత్రం కవనం
జగతిగతినంతా ఇముడ్చుకుని తరతరాలకు అందించే జ్ఞానకవచం
మనసులో కలిగే భావాలను
నవరసాలుగా మర్చి నవనవోన్మేషంగా ఉత్కృష్ఠమైనదై రంజింపజేస్తుంది
మనసుకరిగించే మంచులాంటి పదజాలం
ఎదను రగిలించే
మంటలాంటి మాటలను
అనంతమైన దుఃఖసాగరాలకై
ఉప్పెనలా ఉరిమే మెరుపులాంటి భావజాలాన్ని
ముందునిలిపేదే కవనం
కవి హృదయం నిత్య సంఘర్షణ నిలయం
రవిగాంచని చోటెల్లా
కవి కలంతో ముందునిలుపుతాడు
కాలాలెన్నిమారినా కలంతో కవనపూదోటను పరమళింపజేసేవాడు
విశ్వాన్నంతా వికసింపజేస్తడు
సియస్సార్(సి. శేఖర్),
పాలమూరు,
9010480557.