బలిదానం సందర్బంగా

బలిదానం సందర్బంగా


అగ్ని
ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు
చల్లి చైతన్య పరిచిన షహీద్ భగత్ అ రంభ మార్కిస్టు
ఆరాజక వాదం,సామ్యవాదం కు ఆకర్షితుడు అయ్యి
వాటి లక్ష్యం తపించిన తపస్వి
    పువ్వుపుట్టగానే పరిమళించు అన్నట్టుగా
తండ్రి అడిగిన ప్రశ్నకు
తూపాకులు నాటుతూన్నా
భవిష్యత్తుకు బాల్యమే మొ లుక
ధైర్యానికి ప్రతీక దేశభక్తికి ప్రతి రూపం
ధీరత్వానికి మారు పేరు... నవతరానికి స్ఫూర్తి...అలుపెరుగని ధైర్యానికి కొలమానం
ఉరితాళ్ల నే ఉయ్యాలలు ఊగిన సాహసి
బ్రిటన్ ఖైదీల తో సమానంగా
భారతీయుల హక్కులకై
పోరాడిన ధీశాలి
ఆయన మాటలే జీవితానికి దర్పణం
మనుషులను చంపగలం కాని
ఆదర్శాల ను కాదు
నేను జీవితాన్ని ప్రేమిస్తాను
మరణాన్ని కూడా అంతే ప్రేమిస్తా
మేము ఎర్రపువ్వుల0 అయి పూసి
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం
నిప్పురవ్వల మీద నిద్రిస్తాం
తరాలు ఎన్ని మారిన నిత్యం
ఉదయించే సూర్యుడు
చిన్న వయసులోనే   ప్రాణాలు వొదిలి న భగత్  సార్ధక నామధేయుడు  దేశభక్తుడు
   వైద్య.శేషారావు
కామారెడ్డి

0/Post a Comment/Comments