వేసవి కాలం-ఆరోగ్యం

వేసవి కాలం-ఆరోగ్యం

వేసవిలో ఐస్క్రీము
కూల్డ్రింకులు వద్దు
తక్షణ శక్తినిచ్చు
మజ్జిగను మరవద్దు
రసాయన పానీయాలు
కలుగచేయు రుగ్మతలు

వద్దువద్దు రసాయన
పానీయాలు వేసవిలొ
చల్లదనమనుకున్న
ఇబ్బందులు శరీరంలొ
వాస్తవాలు తెలుసుకో
అవి వదిలిపెట్టుకో

రసాయన పానీయాలు
రక్షకాదు శరీరాన్కి
కొబ్బరినీరు తీసుకున్న
మేల్చేయు శరీరాన్కి
కీడుచేయు రసాయనాలు
వదులుకున్న శుభాలు

మజ్జిగమనవాళ్ళ
మర్యాద పానీయము
వేసవితాపంనుండి
రక్షించు తక్షణము
మానవుల అమృతంగ
చెప్తున్నవి శాస్త్రాలు

రసాయన పానీయం
రక్షకాదు శరీరానికి
దీర్ఘకాల రుగ్మతలు
కలుగును దేహానికి
కీడుచేయు పానీయం
వదిలిపెడితే క్షేమం

కొబ్బరినీరు మజ్జిగ
నిమ్మ పానీయాలు
సేవించడం వలన
అనేక ప్రయోజనాలు
వేసవిలో జాగ్రత్తలు
పాటిస్తే శుభాలు

కొబ్బరినీటిలో
పోషకాలు అనేకం
విటమిన్లు ఖనిజాలు
శక్తినిచ్చు అధికం
కొబ్బరినీరు తీసుకొ
ఆరోగ్యం కాపాడుకో.

తాళ్ల సత్యనారాయణ

0/Post a Comment/Comments