కావాలి నారిమణులకు రక్షణ ...వి. కృష్ణవేణి

కావాలి నారిమణులకు రక్షణ ...వి. కృష్ణవేణి

మహిళా సాధికారత
(కావాలి నారిమణులకు రక్షణ)

మీతిమీరిన కట్టుబాట్లకు హద్దులేదు..
ఆడదంటే అంగడిలో వస్తువుకాదు..
అలాగని స్వతంత్రంగా  ఎదగాలి అనేపయ్రత్నంలో మానవ కర్కషాలకు బలి అవ్వక తప్పడంలేదు.
ఓర్పుతో,సహనంతో ఒదుడుడుగు లెన్నో తట్టుకుంటూ..కుటుంబాన్ని నెట్టుకొస్తూ సమాజ కట్టుబాట్లకు తలవొంచి..కష్ట,
నష్టాలకు చేయిఒగ్గి కుటుంబానికి చేదోడువాదోడుగా వుంటూ...
సహనానికిమారుపేరుగా..కుటుంబాన్ని ముందుకునడిపించేవారధిలా...
కుటుంబానికేకాదు సమాజానికి, దేశానికివారధిలా..ఎన్నో అవకాశాలనుఅందిపుచుకుంటూ..
అన్ని రంగాలలో మహిళలే ముందు స్థానంలో రానించగలుగుతున్నారు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని
చక్కబెట్టుకుంటూ..సంస్కృతి సంపద్రాయాలను పాటిస్తూ పగ్రతి పధం వైపు ముందకు వెళ్తున్న ఎంతోమంది నారిమణులు ఉన్నారు.అన్నింటిలోనూ, అన్ని రంగాలలోనూ ముందుకు దూసుకు పోతున్నా రు. అయినగాని మహిళలకు
స్వేచ్ఛ అంటేఒక్క కుటుంబంలోనేకాదు, అన్ని రంగాలలో స్వేచ్ఛ ఉందికానీ మానవరూపం ధరించి సమాజంలో
తిరుగుతున్న కర్కషమృగాలవేటలో చిక్కు కుపోయి అంతమవుతున్న ఆడజాతిని కాపాడుకోవాలి.
ఆ మృగాల వేటను అంతంచేయగలగాలి.అడుగడుగునా మహిళలకు రక్షణ కల్పించాలి.
ఆడవాళ్లకు ఎప్పుడో స్వతంత్రం  వచ్చింది ఎంతోమందిమహిళా నారిమణులు ఎంతోమందిధీరవనితలు వారు సాధించిన
విజయలే నిదర్శనం.మహిళలకు అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు
 ఉన్నాయి.
ఇంటినుండి స్వతంత్రం ఉంది., సమాజంలో స్వతంత్రం   ఉందికేవలం వారికిరక్షణ రక్షణ రక్షణ కావాలి సమాజంలో..
మానవమృగాల
తప్పిదలకు గురికాకుండా ప్రాణారక్షణ,మానరక్షణ కావాలి.అప్పుడే మహిళలకు సాధికారత సాధ్యమవుతుంది...

....వి. కృష్ణవేణి
వాడపాలెం 
తూర్పుగోదావరి జిల్లా


ప్రక్రియ :వచనం 
 

0/Post a Comment/Comments