కొత్తచీర కొనాలన్న
కొరికలే ఎక్కువ
ఇంటి పరిస్థితులు
ఎరిగేది తక్కువ
కొందరి వనితలకు
చీరలపై మోజులు.
కొత్తవంట చేయాలన్న
కోరికతో కొందరు
యూట్యూబ్లో వెతికి
వంటచేయు చుందురు
కొందరి వనితలకు
వంటలంటే మక్కువ.
పిల్లలపై ప్రేమతో
మనసు నొప్పించనివ్వరు
భవిష్యత్తు భారమవు
అది తెలుపనివ్వరు
అతిప్రేమ అవ్వలు
కొంపముంచును తల్లులు.
పదేపదే హెచ్చరిక
పనిలేక కాదు
భవిష్యత్లో బాధపడితె
కాలం తిరిగిరాదు
తెలుసుకుంటే మేలు
లేదంటే తప్పదు కీడు.
సీరియళ్లు కొందరికి
వ్యసనంగ మారినవి
దంపతుల్లో గొడవ
సృష్టించు చున్నవి
సంస్కారమేమి నేర్పవు
వ్యసనమైతే ముప్పు.
సీరియళ్ల సమయమందు
చికాకులెక్కువవును
ఏ సమస్యఎదురైన
ఓపిక తక్కువవును
వారెవ్వా సీరియళ్లు
అల్లర్లకు మూలాలు.
తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.