Pravahini

*అంతరంగమే.....అంతరిక్షం కన్నా మిన్న*

శీర్షిక :అద్భుతసృష్టి మానవమేధస్సు.

ప్రతీ మనిషి తనకు తానే గొప్పవాడు...
అలా అనుకుని బ్రతకకపోతే సమాజం నిత్యం కాకుల్లా పొడుచుకుని తినే మాటలకు బలవ్వక తప్పదు...
తనమీద తనకున్న నమ్మకమే ముందుకు నడిపిస్తుంది. తన ఆత్మ స్థైర్యమే...
ఉన్నత స్థానాన్ని సంపాదించి పెడుతుంది.
దేనినైనా సాధించగలమనే, సాధించి తీరాలి అనే దృఢ సంకల్పమే ఎట్టి పరిస్థితినైనా తట్టుకునే
మనో థైర్యం ఏర్పడ్తుంది..
మనిషి తాను సాధించలేనిది అంటూ ఏదీ లేదు...
భువి నుండి దివికి నిచ్చెన వేయగల సమర్థుడు...
మానవమేధస్సు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించింది.
ఎంతో శాస్త్రసాంకేతికతను, ఆధునికతను మనిషి తన గుప్పిట పెట్టుకుని నడిపిస్తున్న గొప్ప విజ్ఞాన వంతుడు...
యాధృచ్చికంగా, యాంత్రికంగా ఎన్నో నూతనపద్ధతులను అవలంబించి ముందుకు దూసుకుపోతున్నాడు...
భూమండలం నుండి ఉపగ్రహాల వరకు తనథైన రీతిలో అవకాశాలను కల్పించుకుని..
కొత్త కొత్త మార్పులతో నిత్య నూతనత్వాన్ని ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే వస్తున్నాడు.
అంతరిక్షం కన్నా మానవమేధస్సే ఎన్నో రెట్లు అధికం.
మానవఅంతరంగ ఆలోచనే ఎన్నో ఎన్నెన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొంటూ..
 ప్రకృతి వైపరీత్యాల సమయాలలో తలెత్తే ప్రతీ సమస్యను తన గుప్పిట్లో తీసుకుని పరిస్థితులను తట్టుకునే నూతన మార్గాలను ఎంచుకుని
ముందడుగు వేస్తూనే ఉన్నాడు తప్పా వెనకంజ వేసే ప్రసక్తే లేదు.
అంతరిక్షం కన్నా మానవ మేధస్సే వెయ్యిరెట్లు మిన్న.
మానవఅంతరంగమంటేనే ఆలోచనకు పునాది. అదే అంతరిక్ష పరిశోధనకు మైలురాయి...
ఎన్నెన్నో పరిశోధనలకు ఆయువుపట్టు.
అందుకే అంతరిక్షం కన్నా అంతరంగమే నూటికి నూరు పాళ్ళు మిన్న అని చెప్పవచ్చు.


వి. కృష్ణవేణి
తూర్పుగోదావరి జిల్లా

ప్రక్రియ :వచనం 

0/Post a Comment/Comments