గజల్ - పేరు అద్దంకి లక్ష్మి

గజల్ - పేరు అద్దంకి లక్ష్మి

 పేరు అద్దంకి లక్ష్మి
  ఊరు ముంబై
 18_3_22
  గజల్

pravihi pic.jfif

 చిగురించుతు వృక్ష జాతి శోభలతో హోళి వచ్చె
 వసంతుని ఆగమనము పులకించగ హోళి వచ్చె

సుగంధాల పరిమళాలు సప్తవర్ణ శోభలతొ
  కోయిలమ్మ మధురగీతి వినిపించగ హోళి వచ్చె

శివునికంటి మంటజ్వాల కామునికీ దహనమాయె
 దుష్ట జనులు ఆలోచన దగ్ధ మవగ హోళి వచ్చె

మనసులోని మాలిన్యము మంటలలో వదిలివేసి
  వసంతపు నీళ్లు జల్లి పులకించగ హోళి వచ్చె

ఆనందపు కేరింతలు చిన్న పెద్ద భేద మనకు
 అనురాగపు రంగుకలిపి జల్లుకొనగ హోళి వచ్చె

యద నిలిచిన పూదోటలొ వసంతమై విరబూసే
 రంగులన్ని పులుముకుంటు ఆడుకొనగ హోళి వచ్చె

 సమత మమత రంగు లతో లక్ష్మి మనసు నిండి వుంది
 పరవశాన పండుగను జరుపుకొనగ హోళి వచ్చె

0/Post a Comment/Comments