*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*
అంతర్జాతీయన్గా ఎదగాలి మహిళా
- ఇమ్మడి రాంబాబు
మహిళాఓ మహిళ.. ఓ వనిత
ప్రేమామృతం అందించే అమృతమూర్తి వి
నీవు చెక్కిలిపై కన్నీటిని తుడిచే అక్కవు
సోదర ప్రేమకు ప్రతిరూపం నీవే చెల్లి
స్నేహబంధం తో ఆనందాన్నిచ్చే నెచ్చెలివి నీవు
అమ్మ అనుబంధాన్ని ఆఖరివరకు ఆలివై .
ఈశ్వరునిలో..సగమై అర్ధనారీశ్వరి వి
విష్ణుమూర్తి గుండెల్లో పదిలంనీవు..
అందుకో అభివందనం.. వనిత..ఓ మహిళ
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన
చట్టసభల్లో వాణిని వినిపించే వీణాపాణి వి
ఆటపాటల్లో అదరహో అనిపించిన
ఇందిరా ప్రియదర్శనిలా దేశాధినేతగా ఎదిగిన
నీ ఒడి బడి గా మారి
సమాజాన తొలి గురువు నీవే నమ్మా
అయినా అనుదినం అనుక్షణం నీ జీవనం నిర్భయ లా భయానకం.. నేడు మృగాళ్ల నడుమ
భయ బ్రాంత మయం మహిళా ఓ వనిత
అడవిలో మ్రానై పుట్టటం మిన్న నానుడిలా కాక
ఆమె క్షేమమే నా అనే సందేహం ను వీడగ
మదర్ తెరిసా కరుణామృతం కురిపింప
ధీరాలి వై ఝాన్సీ రుద్రమ జిజియా బాయి
అయిలమ్మలా.. ధీశాలివై
నేటి యువతులకి ఆదర్శంగా నిలవాలి నీవు..అంతర్జాతీయంగా ఎదగాలి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ
అందుకో మా వందనాలు అభివందనాలు
- ఇమ్మడి రాంబాబు
తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా
Post a Comment