హృదయ కాశ్మీరం

హృదయ కాశ్మీరం

హృదయ కాశ్మీరం
రచన: డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.

భూతల స్వర్గపు పాతాళాన దాచిన కన్నీటి వ్యథలెన్నో!
నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేసిన కుహనా లౌకిక మేధావుల కుతంత్రాలెన్నో!
సొంతగడ్డపై శరణార్థులుగా  బతుకులీడ్చిన పండిట్ల వ్యథాభరిత చరితలెన్నో!
రాజకీయ చదరంగంలో అస్తిత్వం కోల్పోయిన ఆనవాళ్ళెన్నో!
స్వార్థపు తలారులు ఉరితీసిన ప్రజాస్వామ్యాలెన్నో!
క్రూరత్వ జిహాదీ ముసుగులో చేసిన అత్యాచారాలెన్నో!
నిర్విరామ హత్యాకాండలతో వెళ్ళగొట్టిన సాక్ష్యాలెన్నో!
చరితను ఏమార్చి,
కళంకిత దాస్యము చేసిన
దాఖాలాలెన్నో!
అబ్దుల్లాల ఆధిపత్య,అహంకార క్రీనీడలెన్నో!
కశ్మీరును కబరస్థానులను‌ చేజూసిన కాఫిర్లెందరో!
భరతమాత సిగనున్న పద్మాలను తుంచజూసిన ఖలులెందరో!
తెగువ జూపి ప్రాణాలు తృణప్రాయంగా వదిలిన వారెందరో!
సైనికుల వేషాలతో మారణహోమాలు సృష్టించిన రాక్షసులెందరో!
ఎన్ని దుర్మార్గాలు చేసినా
కాశ్మీరమే నిలిచింది
ముక్తిని పొంది విముక్తయై
నవోదయాలను చూస్తున్నది

(కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత కలిగిన హృదయవేదన నుండి పుట్టిన కవిత)

డా. రామక కృష్ణమూర్తి

0/Post a Comment/Comments