మహిళా మూర్తి
ఓర్పులో భూమాతగా
చదువులో సరస్వతిగా
ఇంటికి దీపం ఇల్లాలు అన్న
సూక్తికి ధర్పణం మహిళా
నవమాసాలు మోసి
కష్టాన్ని ఇష్టంగా భావించి
పురిటినొప్పులకు తాడుకొని
బిడ్డ రూపానికై తల్లడిల్లె
ఆదర్శ మాతృమూర్తి మహిళా
అత్తమామల సేవలో
తరించే కోడలిగా
భర్తకు ఇష్టసఖియై,సగభాగమై
అలానా పాలనా చూస్తే తల్లియై
అతిథి అభ్యాగతులకు అన్నపూర్ణయై
సోదరియై, కల్పవల్లియై
జగన్మోహినిగా, జీవనధాత్రిగా
సుగుణాలరాశిగా, ఆది పరాశక్తిగా
ఇంటా బయట ఒంటిచేతితో
కుటుంబనేపద్యానికి అనుగుణంగా
చాకచక్యంగా బాధ్యతలు మోస్తున్న
ఓమహిళామణి, ఓశక్తి స్వరూపిణి
అమ్మా నీకివే మా వందనాలు
ఓ స్త్రీ మూర్తి నీ కివే మా జోహార్లు
అమ్మ ప్రేమ పంచగలవు
అవణిని ఎలాగలవు
ఆత్మస్తైర్యమే ఆయుధంగా సాగు
మహిళ సోద రి లందరికి వందనం
ఆటంకాలకు బలి కాకు
ధీటుగా ఎదుర్కోండి
ఏ రంగం లోనైన
స్త్రీల పై వ్యక్తిగత వివక్ష
అందుకే బలంగా ఎదుర్కోండి
వెనక్కి వద్దు మేలుకో ఎలుక
---ఉమశేషారావు వైద్య