మహిళలు మహా రాణులు ---కొప్పుల ప్రసాద్

మహిళలు మహా రాణులు ---కొప్పుల ప్రసాద్

 మహిళల దినోత్సవం సందర్భంగా...

*మహిళలు మహా రాణులు*



"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.


వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం మహిళలే. అన్ని విషయాలలో స్త్రీ మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారు ఉన్నారు.


కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు మహిళా కిందికి దిగజార్చారు. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. అనేక రకాల ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతి అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడం వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమయ్యారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయ్యారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం సమస్య పీడించింది. వరకట్నం యిబ్బంది పెడుతోంది. అయితే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నాయి.


దేశానికి ప్రధానమంత్రులయ్యారు, అవుతున్నారు.దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనుల కోసం ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూస్తే ఒక సినిమా కవి - " లేచింది మహిళా లోకం - నిద్ర చేసింది మహిళా లోకం - దద్దరిల్లింది పురుష ప్రపంచం" అన్నాడు. అంతకు ముందే ఇంకో పాత కవి "ముదితల్ నేర్వగరాని విద్య కలదే? ముద్దార నేర్పించినన్" అన్నాడు.


అటువంటి మహిళలను అంతా మెచ్చుకోవలసిందే, ఆచరించవలసినదే. అటువంటి మెచ్చుకోతగ్గ మహిళలు కొంతమందిని ఈ దిగువనుదరించటం జరిగింది.


ఈ మహిళల చరిత్రలు మరింతమందికి మరింత ప్రేరణ కలిగిస్తాయి. అప్పుడే తల్లి ఋణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. ఈ ఆదర్శ మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు విజయపథం వైపు పయనించాలి.ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చు.! మగవాడి చదువు అతనికే పరిమితం కానీ ఆడవాళ్ళ చదువు ఇంటింటి వెలుగు!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు.ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరించే మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణాత్మక వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి, స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం, వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుకుంటారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు.


1.జాతీయోద్యమం : సరోజినీ నాయుడు


ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13 వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి డా. అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి అఘోరనాథ్ చటోపాధ్యాయగారు హైదరాబాదు కళాశాలకి.మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాయడం జరిగింది.


శ్రీమతి సరోజినీ నాయుడు సద్ వంశంలో జన్మించడం వలన, తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్ష, పట్టుదల, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా, ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. ఆ విధంగా కొందరు కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో తెలుసుకొనే వరకూ విశ్రమించారు. రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.


ఆమె పన్నెండవ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగితే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల అంకిత భావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ, విద్య యందు దృష్టి నుంచక, గురువులు చెప్పే పాఠాలు కాలక్షేపానికి నిదర్శనం, గురువులను, సాటి విద్యార్థులనూ ఆవహించే కాలం విలువ తెలియక ప్రవర్తించి, జీవితంలో అడుగు పెట్టి సాధక, బాధలు ఎదురయ్యాక వృథా చేసిన కాలం గురించి బాధపడతారు. అటువంటి వారందరికీ శ్రీమతి మహిళా సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి.భారత దేశ మొదటి గవర్నరుగా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు.


2.రాజకీయ రంగము: ఇందిరాగాంధీ


మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు, స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు నవీన సంప్రదాయానికి అలవాటు పడినవారు.


ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19న జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమె మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మరణకాండలో కొందరు వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తువుల నటీనటులు తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.


ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.


చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి వరకు భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వతంత్ర భారత చరిత్రలో వారికి ఒకదానికి సంపాదించుకున్నారు. వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

ఇందిర ఎన్నో సంవత్సరాలపాటు నెహ్రూగారి వెనుకనే ఉన్నా, అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాలేక పోయిన సభలలో ఆమె మాట్లాడవలసి వచ్చింది. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. సెప్టెంబరు 8న ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించాడు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు, ఆమె జీవితం పట్ల అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూగారితో కలిసి, రాజకీయ నాయకులతోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది.


3.విద్యారంగం: సావిత్రి భాయి పూలె


 భారత మహిళ చైతన్యానికి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి తాడిత పీడిత ప్రజల అభివృద్ధి కొరకు భర్త జ్యోతిరావు పూలే తో కలిసి పని చేసారు.చేశారు 1831 జనవరి 3. నాడు నై గావ్ అనే గ్రామంలో ఆమె జన్మించారు తొమ్మిదవ యేట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలే తో 1840లో వివాహం జరిగింది మొదటి నిరక్షరాస్యులైన సావిత్రి భాయ్ కి భర్త జ్యోతిరావ్ పూలే గురువు అయ్యారు 1948 లో భర్త జ్యోతిరావు పూలే తో కలిసి అనగారిన వర్గాల బాలికల కోసం పూణేలో కేవలం.9 దంపతుల తొమ్మిది మంది బాలికలతో మొదటి పాఠశాలలకు ఈ విద్య నేర్పిన వారు గృహ బహిష్కరణకు భౌతిక దాడులకు అవమానాలకు సిద్ధమయ్యారు. ఇండ్లు విడిపోయారు1852 మహిళా సేవా మండలిని స్థాపించి ఏర్పాటు చేశారు 1873లో మహాత్మారావు పూలే కలిసి సత్యశోధక్ సంస్థను ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతిసహగమనం వ్యతిరేకంగా మహిళలకే ఆదర్శమూర్తిగా నిలిచిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఆదర్శంగా జిల్లా మహిళా ఉపాధ్యాయులుగా అనేకమంది ప్రగతిశీల మహిళా ఉపాధ్యాయులుగా సేవలందించారు. నాయకురాలు ఎస్ బి సూరి బి గీతాంజలి లక్ష్మీదేవి ఉపాధ్యాయులు గౌరీ మేడం శ్యామల మేడంనాగరాజు సార్ గారు చంద్రశేఖర్ గారు చేసారు


4.కళారంగం: సుబ్బలక్ష్మి


తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు.తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో గర్వించదగిన అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించింది.


5. సేవా రంగం: మల్లాది సుబ్బలక్ష్మి


సుబ్బమ్మ 1924, ఆగస్టు 2 వ తేదీ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. "కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?" అని ప్రశ్నించిన స్త్రీవాది. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు.


ఆచార్య సి.నారాయణరెడ్డి ఈమెను గురించి "వాలునుబట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తికాదు" అన్నారు. ఈవిడకు బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. ఈవిడ చదువుకోవడానికి అత్తమామలు వ్యతిరేకించారు. కానీ, భర్త సహకారంతో ఇంట్లోనే విద్య నేర్పి మెట్రిక్‌కి కట్టారు. వరుసగా పి.యు.సి., బి.ఇ., కూడా చదివి, కుటుంబ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.


బాపట్లలో అయిదేళ్లు స్త్రీ హితైషిణి మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారద మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలుగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు. 1970లో విజయవాడలో వికాసం అనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. ఫిలిం సొసైటీకి ఛైర్మన్ అయ్యారు. 1978లో లండన్‌లో జరిగిన ప్రపంచ హ్యూమనిస్టు సభల్లో ఉంటుంది. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో రెండు దండాలు, రెండు ఫొటోలతో ఆదర్శ వివాహాలు జరిపారు.


మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ ఎమ్మెల్యే, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. "వికాసం" తర్వాత "స్త్రీ స్వేచ్ఛ" అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయ పురస్కారం' నెలకొల్పారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అరవైకి పైగా రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం- మహిళా సంఘాలు 1960-1993 అనే పుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు పొందారు. మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాల 2000లో. ఆమె తన యావదాస్తిని 'మల్లాది సుబ్బమ్మ ట్రస్టు'కి రిజిష్టరు చేసారు.


6.అంతరిక్ష రంగం: కల్పనా చావ్లా


కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా నగరంలో కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961కి మార్చారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం.సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా "మోంటు" అని పిలుచుకునే కల్పనా చావ్లా కులీన కుటుంబంలో పుట్టలేదు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన ముందుగా ఎన్నో కష్టనష్టాలకు సిద్ధమయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకు టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బు కోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదించడానికి తండ్రే కారణం. "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుపోయాయి. అందుకు నాన్నే కారణం." అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత జరిగిన ముఖాముఖి లో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించబడింది.


7.క్రీడారంగం:ద్యుతీచంద్


ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం గోపాల్ పూర్ ద్యుతీచంద్ స్వస్థలం. చాలా పేద కుటుంబం. తల్లి, తండ్రి ఇద్దరూ చేనేత పని చేసేవారు. ఇద్దరూ కలిసి పనిచేసిన నెలకు రెండువేల రూపాయలు కూడా వచ్చేవి కావు. ఏడుగురు పిల్లలు... వారినెలా పోషించాలో తెలియదు. చిన్న మట్టి గుడిసెలో నివాసం. టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ద్యుతీకి నాలుగేళ్ల వయసులో పరుగంటే ఏంటో తెలిసింది. ఆమె అక్క సరస్వతికి పరుగు పందేల్లో పాల్గొనడం ఇష్టం. ప్రాక్టీస్ కోసం ఎవరూ తోడు లేరు. కాబట్టి తనకన్నా పదేళ్లు చిన్నదే అయినా తన చెల్లి ద్యుతీని తోడు తీసుకెళ్లేది. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో, ఇసుకలో, మట్టిరోడ్లపై పరుగు తీసేది. ద్యుతికి ఏడేళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు తిట్టారు. వెళ్లి చేనేత పని నేర్చుకోక ఈ పరుగులు ఎందుకని కోప్పడ్డారు. కానీ సరస్వతి ఒప్పుకోలేదు. తన చెల్లిలో అద్భుతమైన నైపుణ్యం ఉందని ఆమె గుర్తించింది. అప్పటికి సరస్వతి మారథాన్‌లో పాల్గొని బహుమతులు తెచ్చి ఇంట్లో ఇస్తోంది. అందుకని సరస్వతి మాటకు తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. తర్వాతి రోజు తన చెల్లిని తీసుకుని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లింది సరస్వతి. అక్కడ ఒక జత బూట్లు కొని చెల్లికి ఇచ్చింది. తిరిగి ఇంటికి బస్‌లో వస్తున్నప్పుడు ఏడేళ్ల ద్యుతీ అడిగింది. 'ఈ బూట్లతో పరిగెడితే ఏం వస్తుంది?' ఏడేళ్ల ద్యుతీ అమాయకపు ప్రశ్న అది. దానికి సరస్వతి అద్భుతమైన సమాధానం చెప్పింది. 'ఇలా కోళ్లతో, సామాన్లతో నిండిన బస్ ఎక్కాల్సిన పని ఉండదు. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి రావచ్చు ' .అంటే! ఆ చిన్నారికి ఆ క్షణమే ఓ అందమైన భవిష్యత్ కనిపించింది. దానికి సరస్వతి అద్భుతమైన సమాధానం చెప్పింది. 'ఇలా కోళ్లతో, సామాన్లతో నిండిన బస్ ఎక్కాల్సిన పని ఉండదు. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి రావచ్చు ' .అంటే! ఆ చిన్నారికి ఆ క్షణమే ఓ అందమైన భవిష్యత్ కనిపించింది. దానికి సరస్వతి అద్భుతమైన సమాధానం చెప్పింది. 'ఇలా కోళ్లతో, సామాన్లతో నిండిన బస్ ఎక్కాల్సిన పని ఉండదు. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి రావచ్చు ' .అంటే! ఆ చిన్నారికి ఆ క్షణమే ఓ అందమైన భవిష్యత్ కనిపించింది.


మూడేళ్లు అక్క శిక్షణలో రాటుదేలిన తర్వాత ద్యుతీకి 2006లో ప్రభుత్వ శిక్షణకు అవకాశం వచ్చింది. అక్కడ ఆహారం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, శిక్షణ ఉంది. అంతేకాదు... తాను ఏదైనా ప్రైజ్‌మనీ గెలిస్తే ఇంటికి పంపొచ్చు.. ద్యుతీలో పట్టుదల పెరిగింది. అంతే. ద్యుతీచంద్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. 16 ఏళ్లలో అండర్-18 జాతీయ ఛాంపియన్‌గా వయసు. తర్వాతి రెండేళ్లలో ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100మీ. 200మీ. విభాగంలో స్వర్ణం గెలిచింది. జీవితం తాను కోరుకున్నట్లే సాగుతోంది. కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్... పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. అంతలో అనుకోని ఉపద్రవం వచ్చింది. ఈమె శరీరంలో పురుష హార్మోన్లు స్థాయికి మించి ఉన్నాయని భారత అధ్లెటిక్ సమాఖ్య ఈమెపై నిషేధం విధించింది. ఈ నిషేధంపై రెండేళ్ళు పోరాడిన తర్వాత 2016లో ఈవిడ స్విట్జర్లాండ్‌లోని న్యాయస్థానంలో పోరాడి తనకు అంతర్జాతీయంగా అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది.


8.ఆధ్యాత్మిక రంగం: శారదాదేవి


శారదాదేవి (డిసెంబరు 22, 1853 - జూలై 20, 1920), జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు శారదాదేవిని శారదామాయి/శారదమాత/శ్రీ మా/హోలీ మదర్ అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందించడంలో, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లు విస్తరించడంలో ముఖ్యపాత్ర పోషించారు.


శారదాదేవి జయరాంబాటిలో జన్మించారు. ఐదెళ్ళ బాల్యప్రాయంలో ఆవిడ వివాహం రామకృష్ణులతో జరిగింది. కానీ కిశోరప్రాయం వరకూ రామకృష్ణులుండే దక్షిణేశ్వర్ కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు ప్రకారం, ఈ దంపతులిరువురూ జీవించినంత సన్యాసులవలే కఠోరబ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం ఈమె కొన్నాళ్ళు ఉత్తరభారతంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కలకత్తాలోని ఉద్బోధన తర్వాత ఉంటారు. రామకృష్ణులశిష్యులందరూ ఆమెను కన్నతల్లిలా చూసుకున్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి అధ్యాత్మిక సలహాలకైనా, సందేహ నివృత్తికైనా శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు ఈవిడను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు.


9.పారిశ్రామిక రంగం: లక్ష్మీ ప్రాతూరి


లక్ష్మీ ప్రాతూరి భారతీయ పారిశ్రామికవేత్త, క్యూరేటర్, ఉపన్యాసకురాలు. ఆమె ఐ.ఎన్.కె సంస్థ వ్యవస్థాపకురాలు, సి.ఈ.వో. ఇంక్ టాక్స్.కామ్ నిర్వహించే లైవ్ ఈవెంట్లకు వ్యాఖ్యాత, క్యూరేటర్ గా వ్యవహరిస్తుంది లక్ష్మి. ఇంక్ సంస్థ నిర్వహణలో జరిగే సింగ్యులారిటీ యు ఇండియా సమ్మిట్ కు ఆమె డైరక్టర్ గా కూడా పనిచేస్తుంది.ఈ సమ్మిట్ ఆసియాలోనే సింగ్యులారిటీ విశ్వవిద్యాలయం నిర్వహించిన మొట్టమొదటి సమ్మిట్. ఆమె ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు, గౌరవాలు అందుకుంది. లక్ష్మికి 2015లో జరిగిన ఆడీ రిట్జ్ పురస్కారాల్లో ఇన్స్పిరేషన్ ఐకాన్ గా గౌరవం లభించింది.అలాగే ఫోర్బ్స్ పత్రిక ఆమెను ఉమన్ టు వాచ్ ఇన్ ఆసియా అనే జాబితాలో చేర్చింది.అత్యంత గౌరవప్రదమైన సమావేశాలైన అమెరికా టెడ్ కాన్ఫరెన్స్, జర్మనీలో డి.ఎల్.డి కాన్ఫరెన్స్, యుకెలో వైర్డ్ కాన్ఫరెన్స్ పాల్ లలో వక్తగా.


10సాహిత్య రంగం: కనుపర్తి వరలక్ష్మమ్మ


వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవాడు.


పదవులు - గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలు,

రచనలు - శారదలేఖలు, మా ఊరు, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, కథ ఎట్లా ఉండాలి, ఉన్నవ దంపతులు

బిరుదులు - గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి, గుడివాడ పౌరులనుండి కవితా ప్రవీణ,

కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న శీర్షకతో అనేక సమస్యలు చర్చిస్తూ రాసారు. తరువాత శారదలేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి సహాయపడుతుంది. ఒక రచయిత్రి ఒక పత్రికలో అంతకాలం ఒక కాలం నిర్వహించడం అదే ప్రథమంగా గణింపబడుతోంది. 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ.


రచయితగా సవరించు

1919 లో ఆంగ్లానువాద కథ అయిన సౌదామినితో రచనలు చేయడం కోసం . లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం, పునఃప్రతిష్ఠ వంటి నాటికలు, 'ద్రౌపది వస్త్ర సంరక్షణ' అనే ద్విపద కావ్యం, 'సత్యా ద్రౌపది సంవాదం' , నాదు మాట' మొదలైన పద్య రచనలు . 'నమో ఆంధ్ర మాత' పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల పాటలు, నవలలు, పిట్ట కథలు, జీవిత చరిత్రలు, కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ, కన్నడ, హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి . ప్రపంచ తెలుగు మహాసభలలో సన్మానం పొందిన రచయిత్రి . మద్రాసు, ఆకాశవాణి కార్యక్రమాలలో విజయవాడ మొదటి మహిళ వరలక్ష్మమ్మ . 1921లో విజయవాడలో గాంధీని జాతీయోద్యమంలో కలిసి . “ నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము . ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి .


10పరిపాలన రంగం: కిరణ్ బేడీ


కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగాసెర్చ్ అవార్డుతో సహా పలు అవార్డులను పొందారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంది.వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విద్యాభాసం కొనసాగింది. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందింది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను, ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్ ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్ ను గెలుపొందింది. 1972లో జూలైలో మొట్టమొదటి ఐ పి యస్ గా ఎన్నికయ్యారు. 1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పేరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ పి యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపివేసిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీయించివేసింది. ఆసమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. 1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు. ఆసమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. 1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు. ఆసమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. 1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు.


--- కొప్పుల ప్రసాద్,

తెలుగు ఉపన్యాసకులు,

నంద్యాల

9885066235

0/Post a Comment/Comments